అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కానీ వారే అభ్యర్థులు అవుతారన్న సంకేతాలను మాత్రం చాలా బలహీనంగా ఇస్తున్నారు కేసీఆర్. తాజాగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నామంటూ.. కొత్త కబురు లీక్ చేశారు. అభ్యర్థులపై వ్యతిరేకత ప్రభుత్వం పుట్టి ముంచుతుందని జరుగుతున్న ప్రచారంతో.. కేసీఆర్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అసంతృప్తులు పార్టీ మారకుండా కూడా.. ముందస్తు ప్లాన్ గా… ఇంకా చాలా మందికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ఖరారు చేయలేదన్న సంకేతాలు పంపుతున్నారు.
పరిస్థితిని బట్టి కొంత మంది అభ్యర్థుల్ని మార్చుతామని కేసీఆల్ లిస్టు ప్రకటన సమయంలో తేల్చేశారు. దీంతో ఇదంతా ఉత్తుత్తి జాబితానేనని.. అసలు జాబితా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక విడుదల చేస్తారన్నప్రచారం ఊపందుకుంది . బండి సంజయ్ కూడా అదే ప్రకటించారు.. ప్రకటించిన వారిలో సగం మందికి టిక్కెట్లు ఇవ్వరని చెప్పేశారు. బీఆర్ఎస్ నేతల్లోనూ అదే అనుమానం ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి 30కిపైగా నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నారు. తర్వాత వాటి సంగతి పెరగవచ్చని అంటున్నారు.
కేటీఆర్ … అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొన్ని అభ్యర్థిత్వాలపై అసలు కసరత్తు ప్రారంభమవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ నేతలెవరికీ కేసీఆర్ వద్ద యాక్సెస్ లేదు. కేటీఆర్ వస్తే మాత్రమే వారికి తమ వినతులు, విజ్ఞప్తులు చెప్పుకునే అవకాశం ఉంది. కేటీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో టిక్కెట్ల సర్కస్ స్టార్ట్ అవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.