తెలంగాణ సీఎంవోలో పీఆర్ఓగా ఉన్న విజయ్‌కుమార్‌ను కేసీఆర్ పదవి నుంచి తొలగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన సీఎంవోలో చేరారు. సీపీఆర్వోగా జ్వాలా నరసింహారావు ఉన్నప్పటికీ… మొత్తంగా సీఎంవో మీడియా వ్యవహారాలు మొత్తం ఆయనే చూసేవారు. సీఎం కేసీఆర్ ఏ పర్యటనకు వెళ్లినా ఖచ్చితంగా ఆయన ఉండేవారు. పీఆర్వోగా పర్మినెంట్ పోస్ట్ కాదని… ట్రాన్స్‌లో మేనేజర్ స్థానంలో.. పర్మినెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారు. అప్పట్లో కేసీఆర్ విజయ్ కుమార్‌ను ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అయితే కేసీఆర్ నమ్మకాన్ని విజయ్ కుమార్ వమ్ము చేసినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా కేసీఆర్‌కు ఆధారాలతో సహా స్పష్టమైన సమాచారం అందడంతో ఆయనను ఉన్నపళంగా పదవుల నుంచి తొలగించారు.
పీఆర్వో పోస్టు మాత్రమే కాదు.. ట్రాన్స్‌కో ఇచ్చిన మేనేజర్ పోస్టు నుంచి కూడా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి విజయ్ కుమార్ తీరుపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని.. దందాలు చేస్తున్నారని కొన్ని మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్.. అలాంటి వాటిని పట్టించుకోలేదు. విజయ్ కుమార్‌ను నమ్మారు. విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏబీఎన్ లో పని చేసేవారు. ఆ సమయంలో ఉద్యోగానికి బదులుగా ఉద్యమం చేసేవారు. ఆయన కుటుంబానికి వరంగల్ జిల్లాలో రాజకీయ నేపధ్యం ఉండటంతో తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ పక్కకు చేరిపోయారు.
ఆయన తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేళ్ల కాలంలో… ఆరేడు వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకుని ఉంటారని… చెబుతున్నారు. ఆస్తుల లెక్క తీస్తే మొత్తం బయటపడతాయంటున్నారు. కానీ కేసీఆర్ పదవుల నుంచి తొలగించి.. సైలెంట్ గా ఉంటారో.. అవినీతిని బయటకు తీస్తారో తెలియాల్సి ఉంది. తానే రాజీనామా చేసుకున్నట్లుగా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.