బీఆర్ఎస్… సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడిందని ఎట్టకేలకు గ్రహించినట్లు ఉంది. ఆదివారం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలతో ఫామ్ హౌజ్ లో కేసీఆర్ సమావేశమై ఈ విషయంపై చర్చించారని.. రేవంత్ ట్రాప్ లో పడకుండా రాజకీయంగా ముందుకు వెళ్లాలని నేతలకు హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు ఏమాత్రం లాభం జరగకపోగా…కౌశిక్ కామెంట్స్ తో బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అరికపూడి గాంధీని అవమానించి బీఆర్ఎస్ కొత్త సమస్యను కొని తెచ్చుకున్నట్లు అయింది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ తెగ గింజుకుంది. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అంటూ కథలు అల్లినా..అప్పటికే బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అలాగే, సర్కార్ పై పలు అంశాల వారీగా దీక్షలు చేపట్టాలని నిర్ణయించగా…కౌశిక్ రెడ్డి – అరికపూడి గాంధీ వివాదంతో ఇవన్నీ డైవర్ట్ అయ్యాయి. దీంతో ఈ విషయాన్ని కేసీఆర్ గ్రహించినట్లు ఉన్నారు. అందుకే కౌశిక్ రెడ్డి వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని, రేవంత్ రెచ్చగొట్టగానే రెచ్చిపోవద్దని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యూహాత్మకంగా ట్రాప్ చేస్తున్నాడని..అందులో చిక్కుకో కుండా ప్రజా సమస్యలను లేవనెత్తాలని సూచించినట్లు సమాచారం.