దుబ్బక దెబ్బతో అలర్ట్ అయిన టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తును పూర్తి చేసింది. ఒక వైపు అభ్యర్థుల సెలక్షన్ కంప్లీట్ చేసిన టీఆర్ఎస్…మరో వైపు ప్రచారానికి సంబంధించి ప్లాన్ ను ఆచరణలో పెట్టేసింది. గ్రేటర్ ఎన్నికల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పార్టీకున్న బలగాన్నంతా దింపి ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రదాన కార్యదర్శులకు డివిజన్ల బాద్యతలు అప్పగించింది. పార్టీ సర్వ సైన్యాన్ని మోహరించి డివిజన్లలో బూత్ల వారిగా ప్రచారం చేసేలా పక్కా స్కెచ్ గీసారు. మంత్రులందరికీ ప్రచార భాద్యతలు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఏడు నుంచి ఎనమిది డివిజన్లు పర్యవేక్షించేలా పని విభజన చేశారు.
మంత్రులకు బాద్యతలు అప్పగించడంతో ఇప్పటికే వారంతా గ్రేటర్ కోసం పనిమొదలు పెట్టారు. మంత్రులు తమ పరిధిలోని డివిజన్ల కు ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇంచార్టీలు నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఏ జిల్లాకు చెందిన మంత్రి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టి చర్చిస్తున్నారు. తాము ఇంచార్జీలుగా వ్యవహరిస్తోన్న డివిజన్ల సమస్యలు, పార్టీ పరిస్తితి, స్థానిక కార్పోరేటర్ల మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తీసుకుని వాటి ఆధారంగా వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు తమ డివిజన్ లో బూత్ కు ఇరవై మందితో కూడిని టీంను సిద్దం చేసుకుని ప్రచారం ముగిసే వరకు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు.
కేసీఆర్ ఆదేశిస్తారు.. కేటీఆర్ పాటిస్తార్నట్లుగా ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. నిరంతరం నగర ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లతో కేటీార్ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకోసం దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. అందరికీ నామినేషన్లు వేయమని సమాచారం ఇచ్చారు. అసంతృప్తులు పక్క పార్టీల్లో చేరి.. నామినేషన్లు వేయకుండా.. బుజ్జగింపుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి కేసీఆర్ పర్యవేక్షణలో కేటీఆర్ గ్రేటర్ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు.