ఉపఎన్నికలో ఓడిపోయి తర్వాత దారుణమైన పరిస్థితులు చూడటం కంటే ముందస్తుకు వెళ్తారని జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్ఎస్ చీఫ్ తేల్చేశారు. కేబినెట్ భేటీ, టీఆర్ఎస్ఎల్పీ భేటీ రెండూ నిర్వహించినా వాటికి ప్రత్యేకత లేనట్లుగా వ్యవహరించారు. కేబినెట్ భేటీలో పాలనకు సంబంధించిన నిర్ణయాలు.. కొన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయి కాబట్టి టెన్షన్ పడవద్దని ధైర్యం చెప్పారు. అంతే కానీ ముందస్తుకు వెళదాం.. తేల్చుకుందాం అని మాత్రం చెప్పలేదు.
మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కోవడం కన్నా.. ముందస్తుకు వెళ్లడమే మంచిదని తనకు వివిధ రకాలుగా అందుతున్న ఫీడ్ బ్యాక్ను కేసీఆర్ పక్కన పడేశారు. ఇదంతా మైండ్గేమ్గా ఆయన భావిస్తున్నారు. ఇంకా ఎన్నికలు ఏడాది సమయం ఉంది. మునుగోడులో బీజేపీకి ఎలాంటి చాన్స్ లేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఎలా చూసినా మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు కాబట్టి.. ఓటమి వల్ల వస్తాయని చెబుతున్న అనూహ్య పరిణామాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే తొందర పడకూడదని కేసీఆర్ డిసైడయ్యారు.
అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా టిక్కెట్ల ఆఫర్ ఇచ్చారు. కొన్నిషరతులు కూడా పెట్టారు. సిట్టింగ్లకు టిక్కెట్లు ఇవ్వాలనేది తమ విధానమని.. దాన్ని చెడగొట్టుకుంటే ఏమీ చేయలేమని వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ ఖరారైతే ఎవరూ పక్క చూపులు చూడరు. కానీ .. టిక్కెట్ రాకపోతే మాత్రం ఆగరు. అందుకే కేసీఆర్ వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించారు.
కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదంతా బీజేపీ వ్యూహాత్మకంగా చేయిస్తున్న ప్రచారంగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ట్రాప్లో పడకూడదని