తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత… పాలనా సంస్కరణలు చేపట్టినట్లుగా కనిపిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు నెలల తర్వాత.. ఓ సోషల్ మీడియాలో ఉన్న వీడియో ద్వారా పైలట్ ప్రాజెక్ట్‌గా.. ఓ సమస్యను పరిష్కరించి.. రెవిన్యూ శాఖపై గురి పెట్టారు. ఆ శాఖను రద్దు చేయబోతున్నామన్న సూచనలు పంపారు. ఆ తర్వాత మున్సిపల్ శాఖపై గురి పెట్టారు. మధ్యలో.. ఓ బహిరంగసభలో… కలెక్టర్ల గురించీ.. మాట్లాడారు. అసలు కలెక్టర్ అనే పదమే.. కరెక్ట్ కాదని తేల్చారు. పేరు మారుస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ అంతకు మించిన సంస్కరణ కోసం కసరత్తు చేశారని… పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి తేలిపోయింది.
కలెక్టర్‌కు ఉండే అధికారాలు, నిధులు మొత్తం మంత్రులకే ఉండేలా.. చట్టం చేస్తామని.. కేసీఆర్ తన పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలకు.. ఇది ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు కానీ.. అధికార వర్గాల్లో మాత్రం మళ్లీ కలకలం బయలుదేరింది. రాజ్యాంగ పరంగా.. జిల్లా కలెక్టర్ అనే అధికారి.. మేజిస్ట్రేట్ కూడా. ఆయనకు సంబంధించిన అధికారులను మంత్రులకు బదిలీ చేయడం అంటే.. సాధ్యమయ్యే పని కాదు. కలెక్టర్ కు కేటాయించే నిధులు.. మంత్రులకు బదిలీ చేయడం కూడా అంత తేలికగా అయ్యే పని కాదు. కేసీఆర్ చెబుతున్నట్లుగా… పూర్తిగా.. పాలనా యంత్రాంగాన్ని పక్కన పెట్టేసి… టీఆర్ఎస్ వ్యవస్థలతోనే… పాలనను నడిపించాలంటే… అది రాజ్యాంగపరంగా.. అసాధ్యమని… నిపుణులు చెబుతున్నారు.
అయితే.. కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రెవిన్యూ, మున్సిపల్ శాఖ అవినీతిపై… చాలా సార్లు మాట్లాడారు కానీ… వాటికి బదులుగా.. టీఆర్ఎస్ నేతలే… పదవుల్లో ఉన్న వారే వ్యవహారాలు చక్క బెట్టేలా చేస్తానని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి అలా చెప్పి ఉండవచ్చు కానీ… నిజంగా అయితే సాధ్యం కాదంటున్నారు. అలా చేయాలంటే.. సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని.. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సెటైర్లు ప్రారంభించారు.