ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును అసెంబ్లీలో పెట్టడం డౌట్ గానే ఉంది. గవర్నర్ ఇంత వరకూ ఆమోద ముద్ర వేయలేదు.అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగుస్తాయి. ఆదివారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఎన్నికలకు వెళ్లే ముందు అసెంబ్లీలో చివరి ప్రసంగం కావడంతో కేసీఆర్ అన్ని అంశాలను హైలెట్ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎలా అభివృద్ధి చెందామో అన్న దగ్గర్నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎలా అన్యాయం చేశాయో చెప్పనున్నారు.
అదే సమయంలో ఆయన వచ్చే ఎన్నికలకు ఎజెండాను కూడా అసెంబ్లీ స్పీచ్ లో డిసైడ్ చేస్తారని అంటున్నారు. గవర్నర్ బిల్లులను ఆపడం .. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను నియమించినా వారికీ గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఆర్థిక సంఘం చైర్మన గా భూపాల్ రెడ్డి అనే నేతను నియమించినా గవర్నర్ సంతకం చేయలేదు. దీంతో మళ్లీ గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారుతోంది.
అసెంబ్లీలో బీజేపీ తీరుపై కేసీఆర్ యుద్ధం ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇప్పుడు బీజేపీని కేసీఆర్ సీన్ లోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబతున్నారు. అంటే.. కేసీఆర్ ఎజెండా సెట్ చేస్తారు. అందుకే అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం పై ఉత్కంఠ ఏర్పడింది.