కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి.. గోదావరిని జీవనదిగా చేసిన కేసీఆర్‌కు ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయినా నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించబోతున్నారా..?. అంటే.. అవుననే అంటున్నారు.. కేసీఆర్ తనయుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. చేనేత దినోత్సవం సందర్భంగా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. అక్కడ చాలా ఉత్సాహంగా.. పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. చేనేత వస్త్రాల దగ్గర్నుంచి రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న నమ్మకం వరకూ.. చాలా మాటలు మాట్లాడినప్పటికీ.. ఆయన నోటి వెంట.. కేసీఆర్‌కు నోబెల్ బహుమతి అన్న పదం రాగానే..అందరూ అలర్ట్ అయిపోయారు.
ఇటీవల కేంద్ర సర్వీసుల్లో ఉన్న కొంత మంది ఐఏఎస్ అధికారులు… కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారట. ఆ సందర్భంగా.. ఈ రీజైన్… అద్భుతమని.. శరవేగంగా పూర్తి చేయడం కూడా.. రికార్డని పొగిడారట. అంతటితో ఆగలేదు.. కాళేశ్వరంకు కర్త, కర్మ, క్రియ అయిన కేసీఆర్‌కు.. కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారట. కాళేశ్వరం ప్రాజెక్టుతో .. గోదావరిని జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ అంటున్నారు. అయిేత.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఇది ఇంజినీరింగ్ వైఫల్యం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
ఎత్తిపోసి.. మళ్లీ.. కిందకు పంపుతున్నారని. ఇది తిప్పిపోతల అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో… కేటీఆర్.. నోబెల్ బహుమతి వ్యాఖ్యలు చేయడం.. అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అద్భుతమని.. నమ్ముతున్న టీఆర్ఎస్ నేతలు… కేసీఆర్‌కు నోబెల్ వచ్చినా ఆశ్చర్యం లేదన్న భావనలో ఉన్నారు.