ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నారు. ఏడాది అంతా నిర్వహించాలని .. మొదటగా ఏప్రిల్ 27న బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం కమిటీలు వేయాలనుకున్నారు. ఇప్పటికి ఒక్క కమిటీని కూడా వేయలేదు. హరీష్ రావుకు ఇలాంటి బాధ్యతలు ఇస్తే పక్కాగా పూర్తి చేస్తారన్న నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. సభ్యత్వ బాధ్యతలు ఆయనకే ఇస్తున్నట్లుగా చెప్పారు. రజతోత్సవ బాధ్యతలూ ఆయనకే ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు.
హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతకు మించి ఆయన ఫోకస్ కావడం లేదు. గతంలో ఆయనకు హుజూరాబాద్ వంటి చోట్ల ఉపఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆయన గొప్పగా ఫలితం సాధించలేకపోయారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ను కాదని హరీష్ కు బాధ్యతలు ఇవ్వడంపై చర్చ జరిగింది. గెలిచే అవకాశం లేదనే హరీష్ కు ఇచ్చారని చెప్పుకున్నారు. ఆ తర్వాత హరీష్ రావుకు ప్రాధాన్యం పెరిగింది. పార్టీ ఓడిపోయిన తర్వాత హరీష్ మరింత యాక్టివ్ గా ఉన్నారు.
పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే హరీష్ ఉత్సాహంగా పని చేయాలని ఆయనకు పెద్ద బాధ్యతలివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. కానీ అవి ఆచరణలోకి రావడం లేదు. ఓ భారీ బహిరంగసభ ద్వారా బీఆర్ఎస్ పార్టీని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గతంలో వరంగల్ లో సభ నిర్వహించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే వరంగల్ లో నిర్వహంచాలని డిసైడయ్యారు. హరీష్ కు అప్పగిస్తే పక్కగా చేస్తారు కానీ ఆయనకు బాధ్యతలివ్వకుండా పార్టీలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకే కేసీఆర్ డైలమాలో ఉన్నారని అంటున్నారు.