తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమిళిసైతో వివాదాల కారణంగా ఆయన రాజ్ భవన్‌వైపు వెళ్లడం లేదు. ఎలాంటి కార్యక్రమాలకూ గవర్నర్‌ను ఆహ్వానించడం లేదు. అయితే మంగళవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంది. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగడం సంప్రదాయం. ఈ సారి అలాగే కార్యక్రమం జరగనుంది. ఏ రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం చేస్తున్నా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా హాజరవుతూంటారు.
అది వ్యవస్థకు ఇచ్చే గౌరవంగా భావిస్తూంటారు. రాజ్ భవన్లో జరిగే చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయంగా రాజ్ భవన్ వర్గాలు మాత్రం సీఎంవోకు ఆహ్వానం పంపాయి. అయితే సీఎంవో మాత్రం ఎలంటి ప్రతి సమాచారం రాజ్ భవన్‌కు పంపలేదు. నిర్ణయం కేసీఆరే తీసుకోవాల్సి ఉంది. కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్తే తమిళిశైకు ఎదురుపడాల్సి ఉంటుంది. అది సీఎంకు ఇష్టం ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోతే.. న్యాయవ్యవస్థను తేలిగ్గా తీసుకున్నట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ విభేదాలోత కీలకమైన కార్యక్రమానికి డుమ్మా కొడతారా అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారోనన్న చర్చ ఇప్పుడు టీఆర్ఎస్లోనూ జరుగుతోంది. అయితే కేసీఆర్ తీరు పరిశీలిస్తున్న వారు మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కారని..సీనియర్ మంత్రులను పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.