తెలంగాణ ఏర్పడిన తరవాత యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా అభివృద్ది చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలని డిసైడయ్యారు. అధికారంగా ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు కానీ.. అధికారిక పత్రాల్లో మాత్రం యాదగిరి గుట్ట అనే ప్రస్తావిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన మొత్తం అధికారిక సమాచారంలో యాదగిరి గుట్ట అనే ఉంది. దాంతో యాదాద్రి పేరును ఇక తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టయింది.
యాదాద్రి అనే పేరును చినజీయర్ సూచించారు. ఆయన సూచన మేరకు పేరు ను కూడా కేసీఆర్ మార్చేశారు. ఇటీవలి వరకూ యాదాద్రి అనే సంబోధించేవారు. చినజీయర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఆనవాళ్లు యాదాద్రిపై ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన యాదాద్రి పేరును కూడా మళ్లీ గుట్టగానే పిలవాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
నిజానికి యదాద్రి పేరు తిరుమలను స్ఫురించేలా ఉంటుందని అనుకున్నారు. అయితే యాదగిరి గుట్ట అనేది తెలంగాణ జన బాహుళ్యంలో విశ్లేష ప్రాచుర్యం పొందింది. నరసింహా స్వామి దగ్గరకు వెళ్లడం కన్నా గుట్టకు వెళ్లొద్దామా అనే మాట్లాడుకుంటారు. యాదాద్రి అని పేరు మార్చిన తర్వాత కూడా అది మారలేదు. దానికి తోడు చినజీయర్‌తో విభేధాలు కూడా కలిసి వచ్చి.. మళ్లీ యాదాద్రి పేరు యాదగిరి గుట్ట అయిపోయినట్లుగా తెలుస్తోంది.