ఆగస్టు 15 వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగస్టు 15 లాగే .. జనవరి 26ను కూడా ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆగస్టు పదిహేను ఘనంగా నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డే ను మాత్రం పట్టించుకోవడం లేదు . దీనికి కారణం గవర్నర్ జెండా ఎగరేసి.. ప్రసంగించాల్సి ఉండటమే.
గత ఏడాది ఈ వ్యవహారం సంచలనం అయితే.. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళిసై గవర్నర్ గా వచ్చిన రెండేళ్లు . పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్ భవన్ లోనే గవర్నర్ పతాకావిష్కణ చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే జెండా ఎగురవేశారు. ఈ ఏడాది కూడా అంతే. ఈ సారి కూడా రాజ్ భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు.
సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేళాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ తో ప్రమేయం లేకుండా అసెంంబ్లీజరుగుతోంది.
నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకుంది.