మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ముందు హడావిడి చేశారు. తన వ్యక్తిత్వానికి భిన్నంగా భారీ బహిరంగ సభలకు బదులుగా, కార్నర్ మీటింగులు.. రోడ్ షోలు, చిన్న పిల్లలతో షేక్ హ్యాండ్స్, కార్యకర్తలతో ఫోటోలు దిగుతూ ప్రచారం చేశారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫేడ్ అవుట్ అవుతుందని, ఒక్క సీటు కూడా గెల్చుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని పోలింగ్ తర్వాత ఓ ప్రచారం మొదలైంది. కొన్ని సర్వేలు, స్టడీలు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది.
ఇక గ్రాడ్యుయేట్ బైపోల్ కోసం కేటీఆర్ ఒక్కరే పనిచేస్తున్నారు. జిల్లాల వారీగా మీటింగులు, రివ్యూలు… నేతలతో చర్చలు జరుపుతున్నారు. హరీష్ రావు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దూరంగానే ఉండగా, కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అవ్వటం ఇప్పుడు పార్టీలోనూ హాట్ టాపిక్ అవుతోంది.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికను కేసీఆర్ లైట్ తీసుకున్నారా…? కేసీఆర్ ను నిరుద్యోగ యువత ఇప్పట్లో చేరదీసే అవకాశమే లేకపోవటంతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాత్రమే చూసుకుంటున్నారా అన్న చర్చతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గెలుపోటములను పక్కన పెట్టి పనిచేయాల్సింది పోయి సైలెంట్ అయితే మిగిలిన క్యాడర్ కూడా వీక్ అవ్వదా అన్న చర్చ పార్టీ నేతల్లోనూ ఉంది.
అయితే, లోక్ సభ ఎన్నికల రిజల్ట్ వరకు కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోనే ఉంటారని…. ఆ రిజల్ట్ ను బట్టి కేసీఆర్ కార్యచరణ ఉండబోతుందని తెలుస్తోంది.