పాట వెనకబడిపోయింది: కీరవాణి బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ

తెలుగు సినిమా సంగీతానికి బాహుబలి కీరవాణి. రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెడితే.. ఆస్కార్ గెలుచుకొని తెలుగువారి కలని సాకారం చేసిన‌ స్వరధీరుడు కీరవాణి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిదిసార్లు, నేపథ్య గాయకుడిగా మూడుసార్లు నంది అవార్డులు, అన్నమయ్య సినిమాకు జాతీయ పురస్కారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు నాటుకి గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌, ఫైనల్ గా అందరికలని నిజం చేస్తూ ఆస్కార్ అవార్డ్. ఇదీ ఆయన ట్రాక్ రికార్డ్. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ ఉష, కీరవాణి తో ప్రత్యేకంగా సంభాషించిన విశేషాలివి.

ఉష: మ్యూజిక్ కంపోజ్ చేయడం ఆర్టా లేక సైన్సా?

కీరవాణి: ఏదైనా పాటకు సంగీతం అందించడం ఆర్ట్ గానే భావిస్తున్నాను. ఎందుకంటే అది సాహిత్యం, భావోద్వేగాల కలయిక. అయితే ఐటెం సాంగ్‌కి మ్యూజిక్ చేయడం మాత్రం సైన్స్.

ఉష: శాస్త్రీయ సంగీతంలో అపారమైన జ్ఞానం ఉన్న పండితులు చాలా మంది ఉన్నారు. అయితే సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే సంగీతాన్ని ఇవ్వలేకపొతున్నారు. (క్లాసికల్ నాలెడ్జ్, కంపోజింగ్) రెండింటిలోనూ నిపుణుడైన వ్యక్తిగా, చాలా మంది శాస్త్రీయ సంగీత ప్రవీణులు సక్సెస్ ఫుల్ కంపోజ‌రు ఎందుకు కాలేకపోయారని మీరు భావిస్తారు?

కీరవాణి: ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నేను మీకు ఒక పోలిక చెప్తాను. ఇంగ్లీష్ పదజాలంలో అపారమైన పట్టుఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి తప్పనిసరిగా కవి అవుతాడని చెప్పలేం కదా. ఏళ్లతరబడి అధ్యయనంలో జ్ఞానాన్ని పొందగలిగినప్పటికీ, క్రియేటివిటీ అనేది చెప్తే వచ్చేది కాదు. ఇది పుట్టుకతో వచ్చే ప్రతిభ.

ఉష: మరి సంగీత పరిజ్ఞానం లేని చాలా మంది సంగీత దర్శకులు కూడా సక్సెస్ ఫుల్ కంపోజర్స్ గా మారారు కదా?

కీరవాణి: మా గురువు చక్రవర్తి గారు దానికి మంచి ఉదాహరణ. ఆయన శాస్త్రీయ శిక్షణ పొందలేదు. కానీ చాలా విజయవంతమైన సంగీత దర్శకుడయ్యారు. థియేరిటికల్ నాలెడ్జ్ వుండటం కూడా చాలా గొప్ప విషయం. అయితే సంగీతంలో కానీ మరో రంగంలో కానీ క్రియేటివ్ ఎబిలిటీ అనేది ఇన్ బోర్న్ ట్యాలెంట్.

ఉష:
చాలా మంది కంపోజర్స్ సంగీతాన్ని స్కోర్ చేయడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. మీకు అలాంటి ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా?

కీరవాణి: చోటుకి ప్రత్యేక ప్రాధాన్యత లేదు. నేను హైదరాబాద్‌లో ఏదైనా ప్రదేశాన్నానైనా ఇష్టపడతాను, అది నాగార్జునసాగర్ కావచ్చు మరేదైనా చోటు కావచ్చు.

ఉష: ట్యూన్ కంపోజ్ చేయడానికి కనీస రిక్వైర్మెంట్ ఏమిటి?

కీరవాణి: మీ షుగర్ లెవల్స్ సరైన స్థాయిలో ఉండాలి.

ఉష: మీ సుదీర్ఘ కెరీర్‌లో మీరు చాలా మంది లిరిక్ రైటర్స్ తో కలిసి పనిచేశారు. మీకు కంఫర్ట్ గా ఉండే లిరిక్స్ రైటర్ ఎవరు?

కీరవాణి: ఎలాంటి కంఫర్ట్?

ఉష: మీతో ఒకే రకమైన వేవ్‌లెంగ్త్‌ని కలిగిన వ్యక్తి ?

కీరవాణి: చంద్రబోస్. మేము ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం. నేను ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు, తను చెప్పిన కొంత ప్రత్యామ్నాయ లిరిక్స్ ని రాస్తాను. అలాగే, చంద్రబోస్ లిరిక్స్ వ్రాసేటప్పుడు, అతను వాటిని ఒక ట్యూన్‌లో ఇస్తాడు. నేను దానిని మరింత మెరుగుపరుస్తాను. సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ గా ఎవరి క్రెడిట్‌లు వారికి వుండటంతో మేమిద్దరం హాయిగా పని చేసుకుంటున్నాం.

ఉష: కె రాఘవేంద్రరావు గారూ, రాజమౌళి గారూ కాకుండా, మీకు గొప్ప వేవ్ లెంగ్త్ ఉందని మీరు భావించే దర్శకుడు ఎవరు ?

కీరవాణి: అలాంటి దర్శకులు చాలా మంది ఉన్నారు – మహేష్ భట్ గారు, కె బాలచందర్ గారు, కె విశ్వనాథ్ గారు, రసూల్ గారు.. ఇలా చాలా మంది.

ఉష: మీరు ఇంకా ఎక్కువ పని చేసి ఉండాలని కోరుకునే దర్శకుడు ఎవరైనా ఉన్నారా?

కీరవాణి: రామ్ గోపాల్ వర్మ.

ఉష: మీరు పని చేయాలనీ కోరుకొని, ఇప్పటివరకు ఇంకా పని చేయలేకపోయాని బావించే దర్శకుడు?

కీరవాణి: శ్రీరామ్ రాఘవన్.

ఉష: సిట్యువేషన్ ని సరిగ్గా వివరించలేని దర్శకులు వుంటారు కదా.. ఆ సందర్భంలో మీరు ఎలా మ్యానేజ్ చేస్తారు?

కీరవాణి: రిఫరెన్స్ అడుగుతాను. గాజువాక పిల్ల లేదా యమహా నగరి (నవ్వుతూ) లాంటి ట్యూన్ కావాలని అడుగుతారు.

ఉష: దర్శకులు ఒక పాట/ట్యూన్‌ని రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్యూన్ మరో సినిమాలో బ్లాక్‌బస్టర్‌గా మారిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా?

కీరవాణి: అనేక ఉదాహరణలు ఉన్నాయి – తెలుసా మనసా.. నిజానికి అల్లరి ప్రేమికుడు కోసం చేశాను, కానీ క్రిమినల్ సినిమాలో వాడాం. నువ్వు విజిల్లేస్తే ఆంధ్రా సోడాబుడ్డి పాట ‘తప్పు చేసి పప్పు కూడు’ కోసం కంపోజ్ చేసి ఆ తర్వాత సింహాద్రిలో వాడాను.

ఉష: చాలా ఏళ్ల క్రితం కె రాఘవేంద్రరావు గారూతో మీకు చిన్నపాటి అపార్థం ఏర్పడింది. ఆ గ్యాప్ ని తగ్గించేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?

కీరవాణి: రెండేళ్ళ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది. కాబట్టి దానిని చిన్న అపార్థం అని అనను. ఆ గ్యాప్‌ని తగ్గించడానికి నేను వ్యక్తిగతంగా ఏమీ చేయలేదు. రాజమౌళి, రాఘవేంద్రరావు గారితో కలిసి పని చేశారు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. రాజమౌళి తన తొలి చిత్రానికి నేను సంగీతం సమకూర్చగలని అడిగారు. నేను అంగీకరించాను. అప్పటి నుంచి రాఘవేంద్రరావు గారితో నా ప్రయాణం ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగింది.

ఉష: ప్రతి టెక్నీషియన్ తమ కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు కదా.. మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? వాటిని ఎలా ఎదుర్కున్నారు?

కీరవాణి: నేను నా కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతికూల సమయంలో ఓర్పుగా ఉంటడం చాలా అవసరం. ఓర్పుగా వుంటే అన్నీ మారుతాయి. ఓర్పు లేని వ్యక్తులు చాలా అవకాశాలను వదులుకుంటారు.

ఉష: సింగర్ కి పాట ఇచ్చే ముందు అతనిలో ఎలాంటి క్యాలిటీ చూస్తారు ?

కీరవాణి: అవైలబిలిటీ.

ఉష: సాధారణంగా ఒక ట్రాక్‌ని కొంతమంది సింగర్స్ రికార్డ్ చేస్తారు. అయితే ఫైనల్ వెర్షన్‌ను ఎవరు నిర్ణయిస్తారు – నా ఉద్దేశ్యం ఏ సింగర్ వెర్షన్ ఫైనల్ అవుతుంది?

కీరవాణి: నేను ఒక పాటను కంపోజ్ చేసినప్పుడు, ఆ పాట పాడడానికి ఎవరు సరిపోతారనే దానిపై నాకు పూర్తి క్లారిటీ వుంటుంది. సాధారణంగా గాయకుల్లో మల్టిపుల్ ఆప్షన్స్ కోరుకునేది దర్శకుడే.

ఉష: సంగీతంలో మీకు అత్యంత ఇష్టమైన జానర్ ఏది?

కీరవాణి: గజల్స్

ఉష: గజల్ మీకు ఇష్టమైన జానర్ కావడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా ?

కీరవాణి: రైలు ఒక స్థిరమైన వేగంతో వెళుతున్నప్పుడు మీరు విండో సీటులో కూర్చుని సీనరీలు చూస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. అదే రైలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే మీరు అదే ఆనందాన్ని పొందలేరు. అదే విధంగా, గజల్‌కు కనీస సంగీత సహవాయిద్యం ఉంటుంది. కాబట్టి మీరు పాట,భావోద్వేగాలను స్వచ్ఛమైన రూపంలో ఆస్వాదించవచ్చు.

ఉష: కొన్ని సంవత్సరాలుగా సంగీత రంగంలో వచ్చిన ప్రధాన మార్పు ఏమిటి?

కీరవాణి: 5 ఇంద్రియాలలో సంగీతాన్ని చెవులు ఆస్వాదించాలి. కానీ ఈరోజుల్లో సంగీత కార్యక్రమాలు విజువల్ ఫీస్ట్‌గా మారాయి. ఉదాహరణకు, నేను ఘంటసాల గారికి వీరాభిమానిని. కాన్సర్ట్ లో ఆయనను ప్రత్యక్షంగా చూడడానికి ఇష్టపడతాను. నిజానికి, కాన్సర్ట్ ముఖ్య ఉద్దేశం ఇదే. మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ పెర్ఫార్మెంట్ చూడటం. నేడు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, వేషధారణ, ఫైర్ వర్క్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు పాటల రెండరింగ్ పూర్తిగా వెనుకబడిపోయింది.

ఉష: ఈ డౌన్ ఫాల్ కి కారణం ఏంటి అనుకుంటున్నారా?

కీరవాణి: సంస్కృతి, సంప్రదాయం లేకపోవడం, మీ మాతృభాషలో నేర్చుకునే అవకాశాల దొరక్కపోవడం. సంగీతం మీ సంస్కృతిలో భాగం, మీరు మీ స్వంత సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించనప్పుడు, అదే సంగీతంలో కూడా ప్రతిబింబిస్తుంది.

ఉష: మీరు ఆసువుగా కంపోజ్ చేసిన పాట మీ ఊహుకు మించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందా ?

కీరవాణి: నాటు నాటు (నవ్వుతూ).

ఉష: ఏ పాట కంపోజ్ చేయడానికి చాలా సమయం పట్టింది ?

కీరవాణి: అల్లరి ప్రియుడు సినిమాలో ఉత్తరాల ఊర్వశి. ఈ పాట కంపోజ్ చేయడానికి 3-4 రోజులు పట్టింది, ముఖ్యంగా చరణాన్ని. సాధారణంగా, నాకు పాటను కంపోజ్ చేయడానికి 10-15 నిమిషాలు పడుతుంది. రన్‌టైమ్‌లో ఓ పాట కూడా కంపోజ్ చేశాను.

ఉష: రీరికార్డింగ్ గురించి?

కీరవాణి: గతంలో దాదాపు 50 మంది సంగీతకారులు చేసిన రీ-రికార్డింగ్ ఇప్పుడు ఒక వ్యక్తితో జరిగిపోతుంది. సాధారణంగా, పెద్ద సినిమాలు రీ-రికార్డింగ్ కోసం 3 నెలలు పడుతుంది. కొన్ని సినిమాలకు నెల సమయం పడుతుంది. మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు వంటి సినిమాల రీరికార్డింగ్‌ను మూడు రోజుల్లో పూర్తి చేశాను. ఈ సెషన్‌ల కోసం మేము 50 మంది సంగీతకారులతో పని చేశాం. ఈ టీంలో1 కండక్టర్, 2 కీబోర్డులు, 20 వయోలిన్స్ , 3 సెల్లోలు, 1 డబుల్ బాస్, 6 ఢోలక్‌లు, 4 తబలాలు, 2/3 పెర్కషన్ వాద్యకారులు, 7 లేడీ కోరస్ సింగర్లు, 1 వీణ, 2 సితార్లు, 2 ఫ్లూట్స్, 2 గిటార్స్, ఎకౌస్టిక్ 1, ఎలక్ట్రిక్ గిటార్, 1 వైబ్రాఫోన్, 1 మాండలిన్, 1 సంతూర్, అప్పుడప్పుడు ట్రంపెట్స్.

ఉష: పాట రికార్డింగ్ ప్రక్రియ గురించి ?

కీరవాణి: మేము ఒకే రోజులో 2 పాటల రికార్డింగ్‌లను పూర్తి చేసేవాళ్లం. కాల్ షీట్ ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. రిహార్సల్, సౌండ్ సెటప్ ,రికార్డింగ్ తర్వాత నోట్స్ రాయడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆపై బాలు గారు చిత్ర గారి వాయిస్ మిక్సింగ్ తర్వాత వారి వాయిస్‌ని రికార్డ్ వుంటుంది.

ఉష: SPB గారు , చిత్ర గారు మీకు చాలా ఇష్టమైన గాయకులు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఏ సింగర్ రికార్డ్ చేయడానికి ఇబ్బందిగా వుంటుంది ?

కీరవాణి: మణి శర్మ; తను అద్భుతమైన సంగీత దర్శకుడు కానీ బ్యాడ్ సింగర్ (నవ్వుతూ)

ఉష: మీకు లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా?

కీరవాణి: అవును, ఆమె సింగర్ కమ్యునిటీకి చెందినది. నేను వారి రాష్ట్రానికి చెందినవాడిని కానని అమ్మాయి తండ్రి అభ్యంతరం.

ఉష: చిన్నతనంలో మీకు అత్యంత ఇష్టమైన నటుడు ఎవరు?

కీరవాణి: సూపర్ స్టార్ కృష్ణ గారు. నా చిన్నతనంలో కృష్ణ గారు యాక్షన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. సినిమా ఫెయిల్యూర్‌ని అంగీకరించడంలో కృష్ణగారి ముక్కుసూటితనం, ఆయన దయగుణం నాకు చాలా ఇష్టం. అలాగే, చాలా మంది హీరోయిన్లు కృష్ణ గారితో పనిచేయడం చాలా కంఫర్ట్బుల్ గా వుంటుందని చెప్పిన సందర్భాలు వున్నాయి.

ఉష: మీరు మీ కెరీర్‌ను ప్రారంభించినప్పుడు, మీరు ఇంత ఎత్తుకు చేరుకుంటారని ఊహించారా?

కీరవాణి: నేను పగటి కలలు కన్నాను! నా పగటి కలలలో 50% నిజమయ్యాయి, మిగిలిన 50% నిజం కాలేదు (నవ్వుతూ).

ఉష: ఆస్కార్ అవార్డు ప్రసంగం చేస్తున్నప్పుడు, మీ మనస్సులో ఏమనిపించింది ?

కీరవాణి: ఆస్కార్ ప్రసంగం సందర్భంగా నేను నా మనసులోని మాటను చెప్పాను.

ఇలా సాగింది ఆ ఇంట‌ర్వ్యూ ప్ర‌వాహం. మ‌రోసారి తెలుగు360.కామ్ తరపున ఎంఎం కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కంపోజిషన్‌లు మ్యూజిక్ పట్ల మీ అంకితభావానికి, అభిరుచికి గొప్ప నిదర్శనం. భవిష్యత్తులో మరెన్నో అద్భుత విజయాల్ని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close