ఆస్కార్ అందుకున్న సమయంలో కీరవాణి మాట్లాడుతూ.. నేను రిచర్డ్ కార్పెంటర్ ల యొక్క సంగీతాన్ని వింటూ పెరిగానని వ్యాఖనించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిచర్డ్ కార్పెంటర్ స్వయంగా తన టీమ్ తో ఒక పాట రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను షేర్ చేశారు.
దీనిపై రాజమౌళి సోషల్ మీడియా స్పందించారు. ‘‘సర్.. ఆస్కార్ ప్రచారంలో మొత్తం అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన ఉద్వేగాన్నీ బయటపెట్టలేదు. కానీ, మీ పోస్ట్ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటుంబానికి ఇదొక మధురానుభూతి’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.