మహానటి.. సావిత్రి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్. సావిత్రిలా నటించడం అంటే, ఆమెలా కనిపించడం కాదు, ఆమెలా ప్రవర్తించడం. ఈ విషయం బాగా అర్థమైందనుకుంటా. అందుకే నిజ జీవితంలో సావిత్రి ఏం చేసిందో… వాటన్నింటినీ ఫాలో అవుతోంది కీర్తి. ఆ రోజుల్లో సావిత్రి… తన స్టాఫ్‌ని బాగా చూసుకొనేవారట. సెట్లో ఉన్నవాళ్లందరికీ ఏదో ఓ సందర్భంలో చిన్న చిన్న బహుమానాలు ఇచ్చేవారట. బంగారు నాణాలను కూడా పంచి పెట్టేవారని చెబుతుంటారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే చేస్తోంది. మహానటి సెట్లో ఉన్నవాళ్లందరికీ బంగారు నాణాలు పంచి పెట్టిందట. సెట్లో అందరినీ కలుపుకొంటే దాదాపుగా వంద మందైనా ఉంటారు. వాళ్లందరికీ తన స్వహస్తాలతో బంగారు నాణాలను ఇచ్చిందట. సావిత్రి పాత్రలో కీర్తి అంతగా ఇన్వాల్వ్ అయిపోయింది మరి! ఇలా నాణాల్ని పంచిపెట్టడం ఈ సినిమాతోనే సరిపెడుతుందా? లేదంటే ఇక మీదట ఇదే పద్ధతి ఫాలో అవుతుందా? అనేది కీర్తికే తెలియాలి. ఏదేమైనా… ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఇదో కొత్త మార్గం అనిపిస్తోంది. కిపిటప్ కీర్తీ…!