‘గబ్బర్‌సింగ్’ మొదలుకొని వరస హిట్స్‌తో గోల్డెన్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకొని అందరు హీరోలతో వరస పెట్టి సినిమాలు చేస్తున్న శృతిహాసన్‌కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జయం రవి హీరోగా తమిళ్లో రూపొందిన సూపర్‌హిట్ మూవీ ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, డి.వి.వి.దానయ్య కలిసి నిర్మిస్తారని చెప్పారు. ఆ తర్వాత అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా ముందుకొచ్చారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. రామ్‌చరణ్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తే బాగుంటుందన్న విషయంలో చాలా రోజులు డిస్కషన్స్ జరిగిన తర్వాత ఫైనల్‌గా ‘ఎవడు’ చిత్రం రామ్‌చరణ్‌తో జత కట్టిన శృతిహాసన్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్గా అందిన సమాచారం ఏమిటంటే ‘నేను శైలజ’ వంటి సూపర్‌హిట్ మూవీలో తన అందంతో, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న కీర్తి సురేష్‌ని ‘తని ఒరువన్’ రీమేక్‌లో తీసుకోబోతున్నారు. ‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా శృతిహాసన్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కీర్తి సురేష్ అందర్నీ ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతోంది.