డిమాండ్ – సప్లై సూత్రానికి ఎవరూ అతీతులు కారు. చిత్రసీమ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మార్కెట్ నీ, ట్రెండ్ ని ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ విషయంలో ఇదే జరిగింది. పద్ధతైన పాత్రలతో, సంప్రదాయకరమైన కట్టు బొట్టుతో కనిపించే అనుపమ – ఈమధ్య హద్దు దాటుతోంది. ‘రౌడీ బోయ్స్’లో లిప్లాక్కులతో హీట్ ఎక్కించింది. ఇప్పుడు ‘టిల్లు స్వ్కేర్’లోనూ రెచ్చిపోతోంది. అనుపమలో ఈ ఊహించని మార్పుకి.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పుడు అనుపమ బాటలోనే కీర్తి సురేష్ కూడా ప్రయాణించబోతోందని టాక్.
కీర్తి సురేష్ కి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. మహానటితో ఆమె జాతీయ అవార్డు కూడా సంపాదించింది. పద్ధతైన పాత్రలకు తను కేరాఫ్ అడ్రస్స్. అయితే కొంతకాలంగా ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. మిగిలిన కథానాయికలతో పోటీ తట్టుకోలేకపోతోంది. మళ్లీ గాడిలో పడడానికి కీర్తి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ సినిమా అంటే.. రెండో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడినట్టే. అయితే సదరు సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందట. మొదట అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నిరాకరించిన కీర్తి.. ఆ తరవాత ఒప్పుకోవాల్సివచ్చిందట. కీర్తిని ఇలాంటి సన్నివేశాల్లో చూడడం అభిమానులకు కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ తప్పడం లేదు. ఈ జనరేషన్ హీరోయిన్ల పోటీని తట్టుకొని రావాలంటే కొన్ని రూల్స్‌ని పక్కన పెట్టాల్సిందే. కీర్తి, అనుపమ అదే చేస్తున్నారు. మున్ముందు ఇంకెంత మంది హీరోయిన్లు వీళ్ల బాటలో నడవాల్సివస్తోందో..?