కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఇండస్ట్రీని ఓ కుదుపుకుదిపాయి. చాలా మంది తారలు ఈ విషయంలో తన మనసులో మాట చెప్పారు. తాజాగా కీర్తి సురేష్ కూడా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి ఉంటుందని చెప్పింది.
”సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి నాకు చెప్పారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు నా దగ్గరకు రాలేదు. కాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందని భావిస్తాను. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. దిని బదులు సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను. అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ నేను కాదు’ అని చెప్పుకొచ్చింది కీర్తి.