నిర్మాతకి ‘మేకర్’ హోదా ఇచ్చిన వారిలో అశ్వనీదత్ కూడా ఒకరు. తక్కువ సినిమాలు చేసినా.. క్వాలిటీ, మేకింగ్ విషయంలో ఏమాత్రం రాజీ పడడు. పక్కా ప్లానింగ్ అంటే ఎలా ఉండాలో టాలీవుడ్ నవతరం నిర్మాతలకు నేర్పింది ఆయనే. అయితే ‘సావిత్రి’ సినిమా ఎనౌన్స్చేసినా… ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి పురోగతీ లేదు. అసలు ‘సావిత్రి’ పాత్రధారి విషయంలోనే దత్ మల్లగుల్లాలు పడుతున్నాడు. సావిత్రిగా బాలీవుడ్ హీరోయిన్ని ఎంచుకొందామన్న ప్రయత్నం దత్‌ది. పారితోషికం భరించలేకో, లేదంటే కాల్షీట్ల సమస్యల వల్లో.. ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. కొంతకాలం ఈ ప్రాజెక్టు నిత్యమీనన్ టూ సమంత… సమంత టూ నిత్యమీనన్ చుట్టూ సాగింది. ఇప్పుడు కీర్తి సురేష్ వచ్చి చేరింది. కీర్తిని `మహానటి`గా చూపించేప్రయత్నాల్ని దత్ అండ్ టీమ్ ముమ్మరం చేసింది.
సావిత్రికీ, కీర్తి సురేష్‌కీ పోలికేంటి?? సావిత్రి గా కనిపించే సత్తా, స్టామినా కీర్తి సురేష్‌లో ఉన్నాయా? అన్నది అనుమానమే. సావిత్రి సినిమా చూసేది…కేవలం సావిత్రి కోసమే. సినిమా అంతా తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపించగల సత్తా… ఆ నటీమణికి ఉండాలి. కీర్తి సురేష్‌కి అంత స్టామినా ఉందా, లేదా?? అనేది దత్ ఆలోచించారా అనే అనుమానం వేస్తోంది. నిత్యమీనన్ కాదందని సమంత దగ్గరకు సమంత వద్దన్నదని కీర్తి సురేష్ దగ్గరకు వచ్చారేమో గానీ… కీర్తి సావిత్రి పాత్రకు బెస్ట్ ఆప్షన్ అని కాదు. ‘మహానటి’ అని పేరు పెట్టి కీర్తి సురేష్ లాంటి జూనియర్లను తెరపై చూపిస్తే కచ్చితంగా అది రాంగ్ స్టెప్పే అవుతుంది. సినిమా రంగంలో ఇంతటి అనుభవం ఉన్న అశ్వనీదత్‌కి సావిత్రి పాత్రకు సరితూగే నటి ఎవరో అంచనా దొరకటం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. ఈవిషయంలో దత్ ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో?