కీరవాణికి ఇద్దరు కుమారులు. కాలభైరవ గాయకుడిగా రాణిస్తున్నాడు. మరో కుమారుడు శ్రీ సింహా సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. `రంగస్థలం` చిత్రం కోసం సుకుమార్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ ఇప్పుడు శ్రీసింహాని హీరోగా చేయాలని భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం శ్రీ సింహా కోసం కథల్ని సిద్ధం చేసే పనిలో పడింది మైత్రీ మూవీస్. ఓ కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నట్టు టాక్. మెగాఫోన్ పట్టాలన్న ఉద్దేశంతో శ్రీసింహా పరిశ్రమలో్ అడుగుపెట్టాడు. అయితే అనుకోకుండా.. నటుడిగా అవకాశం రాబోతోంది. అందుకోసం.. శ్రీసింహా ముందస్తు కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ ఇప్పుడు చిన్న సినిమాలపై బాగా ఫోకస్ పెట్టింది. ప్రతిభావంతులైన యువ దర్శకుల్ని కనిపెట్టి, వాళ్లతో కథలు సిద్ధం చేయిస్తోంది. అందులో ఓ కథలో.. శ్రీసింహా హీరోగా కనిపించబోతున్నాడు. మొత్తానికి కీరవాణి తనయులిద్దరూ సెటిలైపోతున్నట్టే.