ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలని తన భార్య చెప్పిందని ఆస్కార్ అవార్డు గెల్చుకున్న సంగీత దర్శుకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లో ఆస్కార్ సాధించుకుని వచ్చిన సందర్భంగా టాలీవుడ్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు వచ్చారు. ఈ కార్యక్రమంలో తన ఆస్కార్ అనుభవాల్ని కీరవాణి పంచుకున్నారు. రామోజీరావు గురించి రెండు నిమిషాల సేపు మాట్లాడారు.
మా ఆవిడ జీవితంలో ఒక్కరోజైనా రామోజీరావులా బ్రతకాలని అంటుంది.. . నేను ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆస్కార్ తీసుకురండి అన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు దాని విలువ తనకు తెలిసొచ్చిందన్నారు. రామోజీరావు అంతటి గొప్ప వ్యక్తి దృష్టిలో ఆస్కార్ కి ఇంత విలువ ఉందా! అనిపించింది. అప్పుడు ఆస్కార్ గెలవాలనే కోరిక కలిగిందని కీరవాణి అన్నారు. రామోజీరావుపై కీరవాణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం స్టేజ్ పై ఉన్న కొందరికి సహజంగానే ఇబ్బంది కలిగిస్తున్నారు.
రామోజీరావును ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. వయోభారంతో ఆయన ఈనాడు పత్రిక కానీ .. మార్గదర్శి వ్యవహారాలు కానీ ఆయన నేరుగా చూడటం లేదు. అయితే ఏ తప్పు లేకపోయినా. . ఎవరూ ఫిర్యాదులు చేయకపోయినా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి .. సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.