కోవిడ్ వల్ల ఆదాయం పడిపోయిందంటూ… వ్యాట్లు.. వాటిపై అదనంగా పన్నులు పెంచేసి ప్రజల్ని పిండేస్తున్న ప్రభుత్వాలను ఇప్పటి వరకూ చూశాం కానీ.. తగ్గించిన ప్రభుత్వాలను మాత్రం పెద్దగా చూడలేదు. అది కూడా.. రేట్లు విపరీతంగా పెరిగి.. ప్రజల్లో అసంతృప్తి పెరిగిదంనుకుంటే… ఓ రెండు రూపాయలు పాలకులు తగ్గించేవారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇందులో తన మార్క్ చూపించారు. ఆయన ఏకంగా.. లీటర్‌కు రూ. ఎనిమిదిపైనే ధర తగ్గించేశారు. ఇందు కోసం.. 30 శాతం ఉన్న వ్యాట్‌ను.. 16.75 శాతానికి తగ్గించేశారు. ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం కోల్పోనుంది. అయినప్పటికీ కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు.
ఇటీవలి కాలంలో.. కేంద్రం ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించిన తర్వాత… నిధుల కోసం.. పెట్రోల్, డీజిల్‌పై భారీగా వడ్డించింది. రోజుకు.. అర్థరూపాయికి అటూ ఇటూగా పెంచుతుంది… పెట్రోల్, డీజిల్‌పై.. దాదాపుగా రూ. పది పెంచారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వడ్డించాయి. ఈ కారణంగా… కొన్ని చోట్ల.. పెట్రోల్ ధర కన్నా.. డీజిల్ ధరనే ఎక్కువ అయింది. పెట్రోల్ ఎక్కువగా వ్యక్తిగత వాహనాల్లో వినియోగిస్తారు.. డీజిల్ వినియోగం పూర్తిగా.. రావాణా రంగంలోనే ఉపయోగిస్తారు. దీని రేటు పెరగడం వల్ల.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ కారణంగా కేజ్రీవాల్… ఢిల్లీలో నిత్యావసర వస్తవుల ధరలను కంట్రోల్లో ఉంచడానికైనా… డీజిల్ ధరలు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ పూర్తిగా మెట్రో ప్రాంతం. పైగా యూనియన్ టెర్రిటరీ. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగానే ఉంటాయి. ప్రధాన ఆదాయ వనరుల్లో పెట్రోల్, డిజిల్‌పై వ్యాట్ కూడా ఒకటి. ప్రజల ఇబ్బందులు తగ్గించడానికి ప్రభుత్వం.. తన ఆదాయానికి కోత పెట్టుకోవడానికి వెనుకాడ లేదు. ఒక్క లీటర్‌కు ఎనిమిది రూపాయలకుపైగా తగ్గించడం అంటే మాటలు కాదు… అలాంటి నిర్ణయాలను.. ఆమ్ ఆద్మీ మాత్రమే తీసుకోగలదు.