ప్రపంచంలోని అత్యంత సంక్షుభిత దేశాల్లో ఒకటి కెన్యా. ఆఫ్రికాలోని అతి పేద దేశాల్లో ఒకటి. కరోనా కారణంగా మరింత చితికిపోయిన దేశం కెన్యా. ఆ దేశం నుంచి కూడా.. జాలి చూపుతూ.. తమ వంతు సాయం అంటూ.. కొన్ని కాఫీ, టీ ప్యాకెట్లు.. అలాగే ఆ దేశంలో పండే కొన్ని ఆహార వస్తువులను ఇండియాకు విరాళంగా పంపారు. ఇదంతా ఉత్తదేనని అనుకున్నారు కానీ.. నిజంగానే ఆ ఎయిడ్.. ఐక్యరాజ్య సమితి ద్వారా ఇండియాకు చేరుకుంది. మహారాష్ట్రలో వాటిని పంపిణీ చేస్తారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో బయట ప్రపంచానికే ఎక్కువగా తెలుస్తున్నట్లుగా ఉంది.
బయట నుంచి చూసే వారికే.. గ్రౌండ్లో పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలుస్తుందన్నట్లుగా ఇండియాలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజల కన్నా… ఇతర దేశాలకే.. ఇండియా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో తెలుస్తున్నట్లుగా ఉంది. లేకపోతే.. కెన్యా లాంటి దేశాలు కూడా స్పందించాలంటే.. అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండాల్సి ఉంది. నిజానికి ఇండియాలో పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనా కేసులు.. మరణాలు అన్నీ.. మరీ ఉత్పాతం వచ్చినట్లుగా ఏమీ లేవు. కానీ .. కారణం ఏదైనా అంతర్జాతీయంగా… స్పందన వెల్లువెత్తింది. ధనిక దేశాలు చాలా సాయం చేశాయి. ఇలాంటి సాయం తీసుకోవడానికి భారత్ వెనుకాడలేదు.
భారత్కు పరువు తక్కువ కాబట్టి… అంతర్జాతీయంగా ప్రకటించే సాయం తీసుకోవడానికి ప్రత్యేక మైన నిబంధనలు ఉంటాయి. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తీసుకోరు. అందుకే.. కేరళ వరదల సమయంలో… గల్ఫ్ దేశాలనుంచి వచ్చే సహాయాన్ని అంగీకరించలేదు. కానీ ఇప్పుడు.. కరోనా సంక్షోభంలో కెన్యా వంటి దేశాలు పంపుతున్న సాయం కూడా.. ఇండియా తీసుకుంటోంది. అందుకే.. బీజేపీ పాలనలో ఇండియా పరిస్థితి ఇంత ఘోరంగా మారిపోయిందన్న ప్రచారాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రారంభించారు.