కేరళ మార్క్ : సీబీఐ, ఎన్‌ఐఏ రాజకీయ కుట్రపై న్యాయవిచారణ..!

కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయం గురించి ప్రత్యేకంగా సాక్ష్యాలు అక్కర్లేదు. ఇతర పార్టీల్లోని నేతలు బీజేపీలో చేరే వరకూ సీబీఐ లేనిపోని కేసులతో వారి వెంట పడుతుంది. బీజేపీలో చేరిన తర్వాత అంతా సైలెంటయిపోతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సీబీఐ … సీబీఐకి అనుమతిలేకపోతే ఎన్‌ఐఏ… చివరికి కేరళలాంటి రాష్ట్రాల్లో కస్టమ్స్‌ను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం.. కస్టమ్స్ అధికారులు లీక్ చేసిన ఓ నివేదికలో… గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి విజయన్ పాత్ర ఉందని వెల్లడయింది. ఓ పద్దతి ప్రకారం.. రాజకీయ దుష్ప్రచారం చేస్తూ… రాజకీయ కుట్రలో ఈ దర్యాప్తు సంస్థలు భాగమవుతున్నాయని కేరళ ప్రభుత్వం ఆగ్రహంతో ఆ సంస్థలపై న్యాయవిచారణ చేయాలని నిర్ణయించింది.

దర్యాప్తు సంస్థలు తప్పుడు కేసులు.. తప్పుడు విచారణలు.. తప్పుడు స్టేట్‌మెంట్లు వాటి ద్వారా రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ప్రయత్నాలను బయట పెట్టడానికి… జ్యూడిషియల్ విచారణ అవసరమని..మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఈ విచారణ చేయించాలని కేరళ కేబినెట్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంగా ఈసీ అనుమతి తీసుకుని ఈ కమిషన్‌ను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారానికి తిరుగులేని వారు… రాజకీయంగా ఎవర్ని టార్గెట్ చేయాలనుకుంటే వారిని చేయవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారి కుట్రలన్నీ బయట పెట్టే అస్త్రం తమ వద్ద ఉందని కేరళ అధికార పార్టీ ముందుకు వచ్చింది.

ఎన్నికల కమిషన్ అనుమతి మేరకే జ్యూడిషియల్ కమిషన్ నియమించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ .. ఒక్క బీజేపీ విజ్ఞప్తులను మాత్రమే సీరియస్‌గా తీసుకుంటుంది. ఇతరులు చేసేవన్నీ పట్టించుకోదు. ఇప్పటి వరకూ ఉన్న ట్రాక్ రికార్డు ఇదే. ఈ కారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థలపై జ్యూడిషియల్ విచారణ కమిషన్‌కు… ఈసీ అనుమతి నిరాకరించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే కేరళలో మళ్లీ పినరయి విజయన్ సర్కారే వస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా ఈ కేబినెట్ నిర్ణయం….. అలా కొనసాగిస్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు వెలువెడుతున్నాయి. అరాచకాలు పెచ్చు మీరితే.. ఎక్కడో ఓ చోట అడ్డు కట్ట పడక తప్పదు. ఇప్పుడు కేరళ నుంచి అలాంటిది ప్రారంభమయిందని భావించవచ్చు.

దేశంలో వ్యవస్థలపై ప్రజలు నమ్మకం పోయేలా పాలకులు వాటిని ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలంటే ఒకప్పుడు… చాలా ఇమేజ్ ఉండేది.కానీ ఇప్పుడు రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయి… అధికార పార్టీకి మిత్రపక్షాలుగానే భావిస్తున్నారు.ఈ సంస్థల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు కూడా నమ్మలేకపోతున్నారు. అధికారపక్షంలో ఉండే అక్రమార్కులకు అండగా ఉండేందుకు ఇతర పార్టీలను వేధించేందుకు మాత్రమే ఉపయోగపడే సంస్థలుగా మారిపోయాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లారెన్స్ తో ముగ్గురు హీరోయిన్లు

డాన్స్ మాస్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌మ్ హీరో.. లారెన్స్ జోరు పెంచారు. ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఆయ‌న ప‌ట్టాలెక్కిస్తున్నారు. 'బెంజ్‌' అనే సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌లే ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో...

ఈ వీకెండ్ లో హైడ్రా దూకుడు ఎక్క‌డో…!

వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... హైడ్రా బుల్డోజ‌ర్స్ వ‌చ్చేస్తున్నాయి. ఎక్క‌డో ఒక చోట కూల్చివేత‌లు జ‌రుగుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా హైడ్రా త‌న స్పీడ్ త‌గ్గించింది. అయితే, తెలంగాణ మంత్రివ‌ర్గంతో పాటు సుప్రీంకోర్టు...

ఎన్టీఆర్ కి క‌థ చెప్పేశాడా?

'వెట్రిమార‌న్ నా అభిమాన ద‌ర్శ‌కుడు. త‌న‌తో ఓ సినిమా చేయాల‌ని వుంది' అంటూ ఇటీవ‌ల 'దేవ‌ర‌' ప్ర‌మోష‌న్ల‌లో ఎన్టీఆర్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా సినిమా హీరోలు ప్ర‌మోష‌న్...

దువ్వాడ హీరోగా “వాలంటీర్” – నిర్మాత దివ్వెల !

కళా పోషకురాలు అయిన దివ్వెల మాధురీ తన రాజా దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ను నిర్మించారు. ఆ సినిమా పేరు వాలంటీర్. క్యాచీగా ఉన్న టైటిల్ గా .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close