చైతన్య : ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కీచకులా – ఇతర చోట్ల అంతా నీతి మంతులా ?

కేరళలో ఏడెళ్ల కిందట జరిగిన ఓ ఘటన నేపధ్యంగా అక్కడి పరిశ్రమ హేమ కమిటీని నియమించింది. ఏడేళ్ల తర్వాత ఆ కమిటీ నివేదిక సమర్పించింది. అందులో ఇండస్ట్రీ అంతా కీచకులే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రతీ దశలోనూ మహిళల్ని వేధిస్తున్నారని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అన్ని చోట్లా ఇండస్ట్రీని నిందించడం ప్రారంభించారు. కానీ చాలా మందికి వస్తున్న.. ఇతర చోట్ల అంతా నీతి మంతులు ఉంటారా అని .

అన్ని చోట్లా ఒకే మనుషులు.. అవే మనస్థత్వాలు !

బ్యాంకింగ్ రంగంలో పని చేసే వారిపై లైంగిక వేధింపులు ఉండవా… విద్యాసంస్థల్లో పని చేస్తున్నంత మాత్రాన అంతా నీతి మంతులే ఉంటారా… సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్..ఇలా ప్రతీ రంగంలోనూ మహిళలు ఉన్నారు. వారందరూ.. సేప్ జోన్లలో పని చేస్తున్నారా ?. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వేధింపులు ఉంటున్నాయా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఒక్కరి వద్ద సమధానం ఉండదు. మనుషులు.. వికృత మనస్థత్వం ఉన్నవారు.. అన్ని చోట్లా ఉంటారు. వారు చేసే పనులకు బలైపోయేవారు ఉంటారు. అంటే… ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాదు. కానీ చిత్రంగా ఇండస్ట్రీలోనే అలాంటివి ఉంటాయన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

హేమ కమిటీల్ని ఇతర రంగాల్లో వేస్తే ఇంకా భయంకర నిజాలు వెలుగులోకి !

ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల్ని ఇలా చేస్తారంట.. అలా చేస్తారంట అని గాసిప్స్ చెప్పుకుని సంతోషపడేవారికి కొదవ ఉండదు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగినా మీడియా భూతద్దంలో చూపిస్తుంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీపై చులకన భావం ఏర్పడేలా చేస్తోంది. కానీ కేరళ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ విషయంలో వేసిన హేమ కమిటీ తరహా కమిటీలో ఇతర రంగాల్లో ఉన్న మహిళల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే ఇంకా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ప్రభుత్వాలు వాటిని డీ గ్లామర్ గా భావిస్తాయి. వాటిలో ఏం జరిగినా లోపల్లోపల జరిగిపోతే చాలనుకుంటాయి. కానీ సినీ పరిశ్రమ విషయంలో మాత్రం రచ్చ చేస్తూంటయి.

మారాల్సింది మనస్థత్వాలు !

వికృత ఆలోచనలు ఉన్న మగాడు ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఒకే రకంగా ప్రవర్తిస్తాడు. అవకాశాల కోసం హద్దులు దాటాలనుకునే మహిళలు కూడా ఉంటారు. ఇలా రెండు వైపుల నుంచి ఉండే తప్పుల వల్లే… అనేక సమస్యలు పుట్టుకు వస్తున్నాయన్నది అసలు నిజం. దీన్ని గుర్తించి అన్ని రంగాల్లోనూ వేధింపుల అవకాశం లేని పని వాతావరణం కల్పించేలా కృషి చేయాలి కానీ.. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రగిలిపోతున్న నార్త్ హిందూ సమాజం !

ఏం చేసినా జగన్ రెడ్డిని సమర్థించే అంధ వ్యక్తులు ఏపీలో ఉంటారేమో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండరు. ఆయన చేసిన మత మార్పిళ్లు.. ఆయన చేసిన హిందూ వ్యతిరేక కుట్రలు దేశం మొత్తం...

ఒకే ఒక్క ప్రశ్న : క్వాలిటీ నెయ్యి అంత చీప్ ఎలా ?

రన్ అనే ఓ సినిమాలో రోడ్ సైడ్‌లో ఐదు రూపాయలకే బిర్యానీ బోర్డు కనిపిస్తే సునీల్ వెంటనే ఓ ప్లేట్ లాగించేస్తాడు. తర్వాత అతని గొంతు నుంచి కాకి అరుపులు వస్తూంటాయి....

న్యాయవ్యవస్థతో ఇప్పటికీ జగన్ రెడ్డి ఆటలు !

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని జగన్ రెడ్డి పరుగు పరుగున హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని...

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close