ఉద్యోగులు ఓ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని..కేరళ ప్రభుత్వం కోరింది. కానీ ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకించాయి. దాంతో… కేరళ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. అయితే.. ఖజానాలో డబ్బుల్లేవు. కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా.. ఇతరత్రా వచ్చిన ఆదాయం మొత్తం కలిపినా ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదు. అందుకే.. ఆరు రోజుల జీతం మాత్రం.. కత్తిరిస్తున్నామని.. ఈ మొత్తాన్ని తర్వాత ఇస్తామని.. కేరళ ఆర్థిక మంత్రి ప్రకటించారు. కేరళ లో 2018 ఆగస్టులో వరదలు విలయం సృష్టించాయి. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. అప్పుడే కేరళ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇప్పుడు కరోనా దెబ్బకు మరింతగా ఇక్కట్ల పాలయింది. అయితే.. అప్పుడు కానీ.. ఇప్పుడుకానీ ప్రజల్ని ఆదుకోవడంలో… లోపాలు రానీయలేదు.
కేరళ సర్కార్ గత నెలలో ఒక్క రూపాయి కూడా ఉద్యోగులకు జీతాం తగ్గించలేదు. లాక్ డౌన్ విధించే సమయానికి ఆదాయం బాగానే ఉండటంతో చెల్లింపులు చేసింది. అయితే.. ఈనెల మొత్తం.. లాక్ డౌన్ ఉంటోంది. అందుకే… జీతాల తగ్గింపు ఆలోచన చేయాల్సి వచ్చింది. ఉద్యోగులు ఓ నెల విరాళం ఇస్తారని అనుకున్నారు కానీ.. వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో… గత నెలలోనే సగానికి సగం జీతం కట్ చేసేశారు. పెన్షన్లు కూడా.. తగ్గించారు. ఈ నెలలోనూ అంతే ఇస్తామని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఏపీ సర్కార్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేపో మాపో అధికారిక ప్రకటన చేయనున్నారు.
అయితే.. కేరళలో… అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. వ్యతిరేకత రావడంతో వెనుకడుగు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. అలాంటి ఆలోచనే లేదు. ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. ఏపీలో … ఉద్యోగ సంఘాల నేతల ను పిలిచి ముఖ్యమంత్రి ఓ మాట చెప్పారు. ఆ ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను తెలుసుకోలేదు. కానీ కేరళలో మాత్రం.. అన్నీ తెలుసుకుని వ్యతిరేకత వచ్చిందని వెనుకడుగు వేశారు. ఏంతైనా… వైరస్ కట్టడి విషయంలోనే కాదు.. ఆర్థిక పరమైన అంశాల్లోనూ తెలుగు రాష్ట్రాలను చూసి.. కేరళ నేర్చుకోవాలనుకోవడం లేదు.