మూడేళ్ల కిందట రాజంపేటలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన వైనం ఇప్పటికీ అందరికీ గుర్తుండి ఉంటుంది. హాయిగా ఉన్న ఉన్న రెండు, మూడు ఊళ్లు ఆ డ్యాం కొట్టుకుపోవడంతో శిథిలాలుగా మారిపోయాయి. డ్యామ్ ఏమీ కొట్టుకుపోకపోయినా అంతకు మించి వంద రెట్ల విధ్వంసం .. అదే తరహాలో జరిగింది కేరళలోని వాయనాడ్‌లో.
ప్రకృతి సౌందర్య ప్యారడైజ్ వయనాడ్
వాయనాడ్ అంటే..రాహుల్ రెండు సార్లు ఎంపీగా గెలిచిన నియోజకవర్గంగా ఎక్కువమందికి తెలుసు. కానీ కేరళ టూరిజం గురించి తెలిసిన వారిని వాయనాడ్ ఎంత అందమైన ప్రదేశమో తెలుసు. స్వర్గానికి మరో పేరు ఉంటే..అదే వాయనాడ్ అవుతుంది. కేరళకు వెళ్లే పర్యాటకులు వయనాడ్‌కు వెళ్లకుండా ఉండరు. వయనాడ్ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించకుండా కేరళ టూర్ పూర్తి కాదు.
శిథిలం చేసిన కొండ చరియలు
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉండే ఆ ప్రాంతంపై ఇప్పుడు ప్రకృతి విరుచుకుపడింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరుచుకుపడి వరద ప్రవాహం రావడంతో నాలుగైదుళ్లూ కనిపించకుండా పోయాయి. అందులో ఉన్న ప్రజలంతా గల్లంతయ్యారు. వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. వేల మంది మంది ఆచూకీ తెలియడం లేదు. వలస వచ్చిన కూలీలు కూడా వందల్లో ఉన్నారు. రక్షణ చర్యల కోసం సైనికుల్ని రంగంలోకి దించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎవరైనా ప్రాణఆలతో ఉంటే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వయనాడ్ కష్టం చూసి దేశం కలత
ప్రకృతి సోయగంతో ఉండే వయనాడ్ ఇప్పుడు ఎటు చూపినాభయం కంపితంగా ఉంది. ప్రకృతి ఆగ్రహం ఎంత భయంకరంగా ఉంటుందో కనిపిస్తోంది. వయనాడ్ కష్టం చూసి దేశం కలత చెందుతోంది. ప్రకృతి సోయగంతో ఉండే వయనాడ్‌కు వచ్చిన కష్టం అందర్నీ చలించేలా చేస్తోంది. వయనాడ్ కు వర్షాలు.. వరదలు కొత్త కాదు.. కానీ కొండ చరియలు కరిగిపోయి ఊరి మీద పడేంతగా ఈ సారి ప్రకృతి ప్రకోపించింది. వాయనాడ్ కష్టం కేరళది మాత్రమే కాదు..దేశానికి. అక్కడి ప్రజల బాధ దేశ ప్రజలందరిదీ !