బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నా రాజీనామాలు అనే మాట జోలికి వెళ్లలేదు. కానీ కేకేతో ఎందుకు అంత వేగంగా రాజీనామా చేయించారని ఆశ్చర్యపోయారు. అయితే పార్టీ మారితే అనర్హతా వేటు ఖాయమని తెలిసి కూడా పార్టీ మారారు కేకే. అలా వేటు పడక ముందే రాజీనామా చేశారు.
లోక్ సభ , అసెంబ్లీల సంగతేమో కానీ.. రాజ్యసభలో మాత్రం ఎవరు పార్టీ మారినా అనర్హతా వేటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో వెంకయ్యనాయుడు అలాగే చేశారు. అందుకే కేకే రాజీనామాకు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆయన మాజీ అయినా ఉపఎన్నిక రాగానే మళ్లీ ఆయనే రాజ్యసభసభ్యుడు అవుతారు. ఈ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం … రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక వస్తే.. కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటున్నారు. తన స్థానం కాబట్టి తనకే ఇవ్వాలన్న డిమాండ్ తో ఆయన పార్టీలో చేరిపోయారు.
కేకే కుమార్తె మేయర్ విజయలక్ష్మి ఎప్పుడో పార్టీ మారిపోయారు. కానీ కేకే మాత్ర..ఆగిపోయారు. రాజ్యసభ సీటు విషయంలోనే క్లారిటీ కోసం ఆగారు. తన వారసురాలి రాజకీయ భవిష్యత్ కోసం ముందుగానే పార్టీ మారిపోయిన ఆయన.. మిగిలిన పదవీ కాలం కూడా… పోగొట్టుకోకుండా… తెలివిగా వ్యవహరించారు. ఆ మాత్రం తెలివి ఉండబట్టే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా .. ప్రజల్లో కనీస పలుకుబడి లేకపోయినా దశాబ్దాలుగా కీలక స్థానాల్లో ఉంటున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.