ఈ వారం రెండు చిన్న సినిమాలతో పోటీ పడుతున్నాడు నిఖిల్. కేశవ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు చిన్న సినిమాలు వస్తున్నా.. ఫోకస్ అంతా కేశవపైనే ఉంటుంది. గత వారం విడుదలైన రాధ.. బాక్సాఫీసు పై ఎలాంటి ఎఫెక్టూ చూపించలేదు. బాహుబలి 2 ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేశవ ఏం చేస్తాడా?? అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలూ కాస్త కట్టుదిట్టంగానే తీసుకొన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా నిడివి విషయంలో దర్శకుడు, హీరో.. కలసి ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఫైనల్ కట్ 116 నిమిషాలకు కుదించారు. నిజానికి 130 నిమిసాల సినిమా ఇది. 14 నిమిషాలు నిడివి ఉన్న సన్నివేశాల్ని ముందే కుదించి… ఫైనల్ వెర్షన్ రెడీ చేశారు.
ఇదో థ్రిల్లర్ సినిమా. కథని ఎంత క్లుప్తంగా చెబితే.. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. అందుకే.. నిడివి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్నార్ట. ఏమాత్రం బోర్ అనిపించినా, ఆ సన్నివేశాన్ని ట్రిమ్ చేసేశారని తెలుస్తోంది. స్క్రీన్ ప్లేలో కాస్త తికమక గమనించిన సుధీర్ వర్మ.. రెండు మూడు సన్నివేశాల్ని ముందుకు జరిపి.. కన్ఫ్యూజన్ లేకుండా చేసుకొన్నాడని తెలుస్తోంది. దాంతో ఆఖరి నిమిషం వరకూ కేశవని కరక్షన్లు చేస్తూనే ఉన్నార్ట. అయితే అవుట్ పుట్‌పై మాత్రం కేశవ టీమ్ పూర్తి నమ్మకంతో ఉందని తెలుస్తోంది.