టీడీపీ నుంచి తనను పొమ్మనలేక పొగ పెట్టారని కేశినేని నాని ఫీలవుతున్నారు. తనకు మహానాడుకు ఆహ్వానం లేదని.. సిటీలో ప్రారంభించిన విజయవాడ టీడీపీ ఆఫీసు ప్రారంభోత్సవానికీ పిలవలేదని చెబుతున్నారు. ఆయన ఎంపీ స్థానంలో ఉండి.. పిలువలేదని చెప్పడం ఏమిటని అందరికీ అనిపించనా ఆయనకు అనిపించలేదు. కొన్నాళ్లుగా కేశినేని నాని పార్టీ కంటే తానే ఎక్కువగా ఎదిగిపోయాననే భావనలో ఉన్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని చెప్పుకుంటున్నారు. తాజాగా అవే వ్యాక్యలు చేశారు. పార్టీ ఇంచార్జులు ఎవరని.. వాళ్లు గొట్టం గాళ్లని తేలికగా తీసి పడేశారు.
ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని నాని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికి ఉన్న ప్రయార్టీ ఎవరికీ లేదన్నారు. వేరే వాళ్ల పాత్ర అక్కడ ఏమీ కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకని విలేకర్లు ప్రశ్నిస్తే ఈ విషయాన్ని చంద్రబాబునో అచ్చెన్నాయుడినో అడగాలని సూచించారు నాని.
సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఆఫీస్ ఓపెన్ చేస్తే తనకు ఆహ్వానం లేదన్నారు. సిట్టింగ్ ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని… అచ్చెన్న మాత్రం ఓపెనింగ్ వచ్చారన్నారు. దీని వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై కూడా ఎవర్నీ తాను ఏమీ అడగలేదన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో కనిపించిన నాని వారం రోజుల్లోనే మరోసారి ఫైర్ అయ్యారు. అయితే తనును చంద్రబాబు పీఏ పిలవడంతోనే ఆ మీటింగ్కు వెళ్లానని.. అసలు మీటింగ్ ఎందుకో ఎవరితోనో ఏం మాట్లాడుకున్నారో తనకు పూర్తిగా తెలియదని కేశినేని నాని చెబుతున్నారు.