బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. చేసింది చాలని.. విజయవాడ అభివృద్ధికి ప్రయత్నిస్తానని రాజకీాయల్లో మాత్రం ఉండనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసీపీ తరపున బెజవాడ నుంచి పోటీ చేసి దాదాపుగా మూడు లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఆయనపై ఆయన సొంత సోదరుడు కేశినేని శివనాథ్ గెలిచారు. అయినా రాజకీయ సన్యాసం గ గురించి ఆలోచించలేదు.
https://x.com/kesineni_nani/status/1800146319090000352
కానీ వైసీపీ అధినేత జగన్ పార్టీ సమావేశం పేరిట పిలిచి.. గదిలో ఓ మూలన నిలబెట్టి మాట్లాడటంతో ఆయన ఈగో హర్ట్ అయింది. టీడీపీ ఓడిపోయిన సమయంలో అండగా ఉండాల్సిన ఆయన.. చంద్రబాబును పదే పదే అవమనిస్తూ.. తాను పార్టీ కంటే ఎక్కువ అన్నట్లుగా చెలరేగిపోయారు . చివరికి ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో వైసీపీలో చేరి.. చంద్రబాబు పోటీ చేసినా బెజవాడలో మూడు లక్షలతో గెలుస్తానని చాలెంజ్ చేశారు.
తనను చూసి ఓటేస్తారని.. టాటా ఫౌండేషన్ తో కలిసి తాను భలే అభివృద్ధి చేశానని భావిస్తూ ఉంటారు. అయితే ఎన్నికల ఫలితాలతో ఆయన భ్రమలన్నీ తొలగిపోయాయి. వైసీపీలో అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో తట్టుకోవడం కష్టమని గుడ్ బై చెప్పారు. ఆయన వేసిన తప్పటడుగుల వల్ల ఆయనతో పాటు.. ఆయన కుమార్తె శ్వేత రాజకీయ జీవితానికీ పులిస్టాప్ పడిపోయింది. అహంకారం రాజకీయాల్లో పని చేయలేదని కేశినేని నానితో తేలిపోయింది.