వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎవరు చెప్పారని .. కేశినాని నాని మీడియాను ఎదురు ప్రశ్నిస్తున్నారు తాను అలా అన్న ఒక్క వీడియోను చూపించాలని ఆయన సవాల్ చేశారు. అంతే కాదు.. తనకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోతే ఏమవుతుందని.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గా గెలిపిస్తారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ఆయనే చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు మాత్రం ఆయన రివర్స్ అవుతున్నారు. టీడీపీలో ప్రక్షాళన జరగాలని..తనకు ఇష్టం లేని వాళ్లకు టిక్కెట్లు ఇస్తే పని చేయనని కామెంట్లు చేస్తున్నారు.
కేశినేని నాని సోదరుడు శివనాథ్ ఇటీవల సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనిపైనా నాని అసంతృప్తి వ్యక్తంమ చేస్తున్నారు. నాలుగు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పంచే వారికే మీడియా సపోర్ట్ చేస్తుందని మండిపడ్డారు. తాను ఎంపీగా ఎన్నో పనులు చేశానన్నారు. లగడపాటి దుర్గ గుడి ఫ్లైఓవర్ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపించానని.. రతన్ టాటా తన స్నేహితడని.. తాను ఏది చేయమంటే అది చేస్తాడని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ స్థాయి నాయకుడిని అయిన నన్ను మీడియా గల్లి స్థాయిలో చూపించాలని చూస్తుందని తన స్థాయికి మీడియాలో కలుగుతున్న ప్రచారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు దానం చేసే వాడు సైలెంట్ గా చేస్తాడు రతన్ టాటా ఎన్ని మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నాడా అని చెప్పుకొచ్చారు. ఫౌండేషన్లు , ట్రస్ట్ లు ఎన్నికల ముందు వచ్చేవే ఎన్నికల అనంతరం కనపడవన్నారు. కేశినేని వ్యాఖ్యలు చూస్తూంటే.. రతన్ టాటానే తనకు టిక్కెట్ ఇప్పించి ఎంపీని చేశారన్నట్లుగా మాట్లాడుతున్నారని విజయవాడలోని ఆయన వ్యతిరేకులు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఆయన వ్యవహారశైలి కారణంగానే చంద్రబాబు సోదరుడ్ని ప్రోత్సహిస్తున్నారని.. ఇప్పుడు ఆయన మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.