కొన్ని ఆల్బమ్స్ కి ఎంతకీ బజ్ రాదు. నితిన్ రాబిన్హుడ్ పరిస్థితి కూడా ఇలానే వుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే రెండు పాటలు వదిలారు. శ్రీలీల లాంటి ట్రెండింగ్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఆ పాటలు ఏమిటో టక్కున గుర్తుకు రావు. నిజానికి డైరెక్టర్ వెంకీ కుడుముల తన సినిమాలో ఓ వైరల్ సాంగ్ వుండేలా చూసుకుంటాడు. ఛలో లో చూసి చూడంగానే, భీష్మాలో వాటే బ్యూటీ ఇప్పటికీ జనాల్లో వుంటాయి. కానీ రాబిన్హుడ్ కి అలాంటి క్యాచి సాంగ్ ఇంకా పడలేదు.
ఇప్పుడు స్పెషల్ సాంగ్ వంతు వచ్చింది. ఇందులో కేతిక శర్మలో ఓ ఐటెం నెంబర్ చేసింది. హాటెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ఈ పాటని ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లలో హాట్ నెస్ కనిపిస్తోంది. మార్చి 10న పాటని రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట జనాల్లోకి వెళితే.. ఎంతోకొంత బజ్ వస్తుంది. మార్చి 28నే సినిమా వస్తుంది. ఈ పాట క్లిక్ కాకపొతే మాత్రమే ఆడియో పరంగా ఇంక బజ్ లేనట్లే.