రాజధాని లేని అనాధగా తయారైన ఆంధ్రప్రదేష్ కు రాజధాని నిర్మాణం విషయంలో సర్కార్ వేగం పెంచింది. అమరావతే రాజధాని ఇప్పటికే ప్రకటించగా, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీని వేగవంతం చేసింది.
అమరావతి రాజధాని పరిధిలో చేపట్టాల్సిన అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు-మంత్రుల నివాస సముదాయాలు, అధికారుల క్వార్టర్స్ నిర్మించబోతున్నారు. ఇందుకోసం అవసరమైన భూమిని నోటిఫై చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఆర్డీయే నిబంధనలకు అనుగుణంగా… మాస్టర్ ప్లాన్ జోనింగ్ నిబంధనలను అనుసరించి రాజధాని ప్రాంతంలో దాదాపు 1575ఎకరాల భూమిని నోటిఫై చేసింది.
రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలోని భూముల్లో భూములను నోటిఫై చేశారు. పూర్తి వివరాలను సీఆర్డీయే వెబ్ సైట్ లో ఉంచినట్లు కమిషన్ వెల్లడించారు.
ఈ ఉత్తర్వులతో భవనాల నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోతాయని, డిజైన్ల విషయంలో గతంలోనే క్లారిటీ ఉన్నందున కాంట్రాక్టు సంస్థకు పనులు ఇచ్చి, రికార్డు టైంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోబోతున్నారు.