రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఇంకా కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉందని అందుకే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీంతో రఘురామ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రఘురామ కేసులో జగన్, పీఎస్ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్ కీలకంగా ఉన్నారు. కింది స్థాయిలో అరెస్టులు చేస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు కానీ ఇంకా పై స్థాయి వరకూ రాలేదు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. తులసిబాబును ప్రస్తుతం మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అందులో వేస్తున్న ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. త్వరలో పీవీ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కేసులో పీవీ సునీల్ కుమార్ అరెస్టు కావడం ఖాయమని రఘురామ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. పీవీ సునీల్ ఎవరి కోసం రఘురామను టార్చర్ చేశారన్నది ఆయన వాంగ్మూలం ఇస్తే.. పీఎస్ఆర్ ఆంజనేయులు, జగన్ కూడా ఇరుక్కుపోతారు. స్వయంగా హైకోర్టుకు కూడా కీలక నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని దర్యాప్తు అధికారులు చెప్పడంతో అసలు వ్యవహారం ముందు ఉంటుందని ఓ నమ్మకం ఏర్పడుతోంది.