ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుదవారం విజయవాడలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎప్పటిలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సాగింది. మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. వాటిలో ముఖ్యమైనవి:
మొదటి దశలో మొత్తం 10,000 ఉద్యోగాల భర్తీ.
గ్రూప్:1లో-94 ఉద్యోగాలు, గ్రూప్: 2లో -750, గ్రూప్:3లో -1,000 ఉద్యోగాలు భర్తీ
హోంశాఖలో 6, 000, టెక్నీషియన్స్- 1,000 ఉద్యోగాలు భర్తీ
వైద్య శాఖలో అన్ని విభాగాలలో కలిపి మొత్తం: 1154 ఉద్యోగాలు భర్తీ
జూన్ 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీ
విశాఖ జిల్లాలోని కృష్ణ పాలెంలో కోకాకోలా కంపెనీకి 100 ఎకరాలు, నక్కపల్లిలో ఫిషరీస్ క్వార మంటైన్ కంపెనీకి 30 ఎకరాలు, ఏపి మెడికల్ రైల్వే జోన్ ఏర్పాటుకి 50 ఎకరాలు, అలాగే అనంతపురం జిల్లాలో గుడిపల్లి ఎస్.ఎల్.డిఫెన్స్ సొల్యూషన్స్ సంస్థకి 95 ఎకరాలు కేటాయింపుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 360 కోట్ల పెట్టుబడితో నిర్మింపబడే ఈ సంస్థలో 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. విశాఖ జిల్లాలో కోకాకోలా కంపెనీని రూ.1,300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తారు. దీనిలో ప్రత్యక్షంగా 3,645 మందికి ఉపాధి లభిస్తుంది. అసంఘటిత కార్మికులకి కూడా భీమా సదుపాయం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తిరుపతిలో ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీ సెంటర్, రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో ఐదు స్కూల్ ఆఫ్ ఎక్సలన్సీ ఏర్పాటు చేయబడతాయి.
ఇటీవల కాలంలో ఇంత బారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయలేదు కనుక నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విశాఖలో అతిపెద్ద కోకాకోలా ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం లైన్ క్లియర్ చేయడం చాలా శుభ పరిణామం. దాని వలన బారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాది అవకాశాలు లభించడమే కాకుండా ఆ కంపెనీ నుంచి పన్నుల రూపేణా రాష్ట్రానికి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న అనంతపురంలో రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే సంస్థ ఏర్పాటుకి లైన్ క్లియర్ చేయడం వలన అక్కడా చాలా మందికి ఉపాధి లభిస్తుంది.