వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లమంటే అక్కడకు వెళ్తున్నారన్నారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ స్పీచ్ అదిపోయే స్పీచ్ ఇచ్చారు. జగన్ పై పంచ్‌లు వేశారు.
నిజానికి వంగవీటి రాధాకృష్ణను వైసీపీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఆయనను అవమానించి వెళ్లగొట్టిన తర్వాత ఈ ఎన్నికలకు ముందు పరిస్థితి బాగోలేదని పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చి ఆయనతో చర్చలకు కొడాలి నాని, పేర్ని నాని, మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిని పంపారు. కానీ వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఎవరి మాటల్ని వినలేదు. చంద్రబాబుతోనే ఉన్నారు. తనపై పదే పదే పుకార్లు పుట్టించినా ఆయన నిమ్మళంగా ఉన్నారు. తాను స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారని తన స్టైల్లోనే చేతలతోనే తన రాజకీయ పయనం గురించి వివరించారు.
తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబునాయుడు ఆఫర్ ఇచ్చారని చెబుతారు. అయితే బెజవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమ ఉన్నారు. ఆ సీటు కాకుంా పెడన లేదా మచిలీపట్నం లోక్ సభ నుంచి అియనా కూటమి తరపున పోటీ చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ప్రచారం మాత్రం ఉద్ధృతంగా చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కూడా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. అందుకే విస్తృతంగా పర్యటిస్తున్నారు.