జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో అధికారికంగా నెంబర్ టు పొజిషన్ లో ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు . పవన్ కల్యాణ్ తన తో సమానమని చంద్రబాబు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. శాఖల పరంగా కూడా అత్యంత కీలక శాఖలను కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇవ్నీ అత్యంత కీలకమైనశాఖలే. అందుకే పవన్ ప్రాధాన్యం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉంటుంది.
డిప్యూటీ సీఎంలకు ఇచ్చే విలువ సీఎం ఇచ్చే అధికారాల్ని బట్టే ఉంటుంది. జగన్ హయాంలో మొత్తం 9 మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. కానీ వీరెవరికీ కనీస పాటి అధికారాల్లేవు. ఎప్పుడూ స్వతంత్రంగా తమ శాఖలపై సమీక్షలు నిర్వహించలేదు. అలాంటి అవకాశం ఇవ్వలేదు. తమ శాఖల్లో విధులు వారు ఎంత నిర్వర్తించారో స్పష్టత లేదు. ఎక్కువగా వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. అంతా సజ్జల చేసేవారు.
ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పలుకుబడి ఉంటుంది. పవన్ కల్యాణ్ తనతో సమానమని చంద్రబాబు చెబుతున్నారు. సీఎం స్థాయిలో కాకపోయినా కాస్త తక్కువగా ఆయినా పవన్ కల్యాణ్‌కు ప్రోటోకాల్ లభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పలుకుబడి లభిస్తుంది. అది రాజకీయంగా వచ్చే హోదా. అదే అసలైన డిప్యూటీ సీఎం గౌరవం అనుకోవచ్చు.