కన్నడ సినిమాగా ప్రారంభమై… పాన్ ఇండియా మూవీగా కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. అన్ని ఇండస్ట్రీస్ వారికి హాట్ ఫేవరేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కేజీఎఫ్ చాప్టర్ 2పై దృష్టి కేంద్రీకరించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌తో చేయడానికి ఆసక్తి చూపించారని కొంత కాలం ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌కు కథ చెప్పారని.. దాదాపు ఓకే అయిందని కూడా చెప్పుకున్నారు. తర్వాత మహేష్‌కు కూడా కథ చెప్పారని చెప్పుకున్నారు. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత ఆయన సినిమా ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుందనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ.. ప్రశాంత్ నీల్ అంగీకరించలేదు.
ఇప్పటి వరకూ .. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం మాత్రం.. ఏది ఖరారు చేయలేదు. ఇప్పుడు కొత్తగా.. తెలుగు హీరో ఎలాంటి సినిమా కమిట్ కాలేదనే సమాచారాన్ని ఆయన వర్గీయులు బయటకు పంపారు. ఆయన దృష్టి బాలీవుడ్‌పై పడిందని.. ఇద్దరు బాలీవుడ్ హీరోలకు కథలు చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 వర్క్ దాదాపుగా అయిపోవచ్చింది. ఈ సినిమాకు కూడా పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. మొదటి భాగంలాగే.. రెండో భాగం కూడా.. హిట్ కొడితే.. ప్రశాంత్ నీల్‌కు బాలీవుడ్లో రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది.
అందులో ఎలాంటి డౌట్ లేదు. అప్పుడు ఆయనకు తెలుగు హీరోలు ఎన్టీఆర్, మహేష్ వైపు చూడాల్సిన అవసరం లేదు. కానీ కేజీఎఫ్ చాప్టర్ 2 అంచనాలను అందుకోకపోతే.. ఆయన చూపు.. మళ్లీ టాలీవుడ్ పై పడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు.. ఇప్పటిలా… ఆయనకు పిలిచి ఆఫర్ ఇస్తారా అన్నది మాత్రం డౌట్.