కేజీఎఫ్ అనేది ఓ ప్రపంచం. అక్కడి మనుషులు, వాతావణం, ఆ కలర్ టోన్.. ఇంకెక్కడా చూళ్లేం. అయితే…. కేజీఎఫ్ ప్రపంచాన్ని `సలార్`లో మళ్లీ చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. సలార్‌లో.. కేజీఎఫ్ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? అనుకుంటున్నారా.. అదే… ఈతరం దర్శకుల మ్యాజిక్.
విక్రమ్ చూశారు కదా. అందులో `ఖైది` కనిపిస్తుంది. `ఖైది 2`కి లీడ్ సీన్‌ని `విక్రమ్`లో వాడాడు… లోకేష్ కనగరాజ్. సరిగ్గా ఇదే ఫార్ములా సలార్‌లో కనిపించబోతోందట. `కేజీఎఫ్ 2`లోని ఓ కీ సీన్… `సలార్`లో ఉంటుందని.. అలా సలార్ ప్రపంచాన్నీ, కేజీఎఫ్ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ తెలివిగా మిక్స్ చేశాడని చెబుతున్నారు. ఆ లెక్కన యశ్… కూడా `సలార్`లో కనిపించే అవకాశం ఉంది. లేదంటే `విక్రమ్`లో `ఖైది` సీన్‌ని రిఫరెన్స్ చూపించినప్పుడు కార్తీని చూపించకుండా తెలివిగా మానేజ్ చేశాడు దర్శకుడు. సరిగ్గా అదే ఫార్ములా ఇక్కడా పాటించే అవకాశం ఉంది. ఏదేమైనా.. సలార్‌లో కేజీఎఫ్ ప్రపంచాన్ని చూడడం మాత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి ఇవ్వడం ఖాయం.