రచయిత, పాత్రికేయుడు ఖదీర్ బాబు సుపరిచితుడే. `ఓనమాలు` చిత్రానికి సంభాషణ రచయితగానూ పనిచేశారు. ఇప్పుడు ఆయన రచించిన `మెట్రో` కథలు వెబ్ సిరీస్‌గా మారబోతున్నాయి. ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా ‘మెట్రో’ కథల్లో కొన్ని వెబ్ సిరీస్‌గా రూపాంతరం చెందుతున్నాయి. ‘పలాస’తో ఆకట్టుకున్న కరుణ కుమార్ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తారు.
గతంలో ఖదీర్ బాబు రాసిన `మెట్రో` కథలు సాక్షిలో ధారావాహికలా ప్రచురించారు. అవన్నీ పాపులర్ అయ్యాయి. ఆ తరవాత కథా సంకలనం వెలువడింది. తేగలు, సెల్ఫీలాంటి కథలు సాహితీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకున్నాయి. వాటిలో ఒకొక్క కథ.. ఒక్కో ఎపిసోడ్ గా తీర్చిదిద్దబోతున్నారు. కొన్ని కథలకు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారిగా నటించబోతున్నాడు. వెంకట్ ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఖదీర్ సంకలం చేసిన 50 స్త్రీ కథల్లో కొన్నింటికి ఇలానే వెబ్ సిరీస్‌గా మార్చే ఆలోచనలో ఉంది `ఆహా`.