టాలీవుడ్ ఇప్పుడు కళకళలాడిపోతోంది. పెద్ద సినిమాలన్నీ వరుస కడుతుండడంతో బయ్యర్ల వ్యవస్థ, టీవీ ఛానళ్లూ… బిజినెస్ వ్యవహారాల్లో తలమునకలైపోయాయి. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్చరణ్, ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జోరందుకొంది. బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 సినిమాలకు బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు శాటిలైట్ హక్కులూ ఒకొక్కటిగా క్లియర్ అవుతున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణిని మాటీవీ రూ.9 కోట్లకు కైవసం చేసుకొంది. ఇప్పుడు చిరు ఖైదీ నెం.150కీ మా టీవీ కర్చీఫ్ వేసినట్టు టాక్. రూ.14 కోట్లకు మాటీవీ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందని టాక్. జీ తెలుగు రూ.12 కోట్ల వరకూ వచ్చి ఆగిపోయిందని తెలుస్తోంది. జెమినీ టీవీ అయితే రేసులోనే లేదు. మాటీవీకీ చిరంజీవికీ సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా.. మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం చిరు చేతికి చిక్కింది. అందుకే… ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా మా టీవీకే ఇచ్చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. దానికి తోడు రూ.14 కోట్లంటే మంచి ఆఫరే! నాలుగైదు రోజుల్లో శాటిలైట్ కి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు – మురుగదాస్ సినిమా జీ తెలుగు కైవసం చేసుకొందని టాక్స్ వినిపించాయి. రూ.16 కోట్లకు ఈ సినిమా కొనడానికి జీ ముందుకొచ్చిందని చెబుతున్నారు. 2017 సంక్రాంతి బరిలో ఖైది నెంబర్ 150 నిలిచిన సంగతి తెలిసిందే. నవంబరు ఆఖరికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.