మెగాస్టార్ ప్రభంజనం మొదలైపోయింది. ‘ఖైదీ నెంబర్ 150’తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అయిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా150 బొమ్మ మరికొద్ది గంటల్లో థియేటర్ లోకి వచ్చేస్తుంది. ఫ్యాన్స్ అంతా అప్పుడే రెడీ అయిపోయారు. తొలి రోజు టికెట్లలన్నీ హాట్ కేకుల్లా అమ్మడైపోయాయి. కౌంటర్ తెరచిన మొదటి అరగంటలోనే టికెట్లన్నీ వెళ్ళిపోయాయి. అటు ఓవర్సీస్ లోనూ అత్యధిక థియేటర్లలో విడుదలౌతుంది ఖైదీ నెంబర్ 150. అక్కడా తొలి రోజుకు అడ్వాన్స్ బుకింగులు జరిగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ముఖ్యంగా ఈస్టు, వెస్ట్ జిల్లాల్లో ఈ సినిమా తొలిరోజు ఒకొక్క థియేటర్ లో నాన్ స్టాప్ షోలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఏడు నుండి ఎనిమిది షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిగతా ప్రాంతంల్లో కూడా ఇదే మానియా వుంది. ఒక టౌన్ లో నాలుగు థియేటర్ వుండే నాలుగు థియేటర్ లోనూ ఖైదీ నెంబర్ 150 సినిమానే కనిపిస్తుంది. ఈ లెక్కల ప్రకారం సినిమా ఎలా వున్న తొలి రోజు కలెక్షన్ రికార్డులన్నీ చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది.
తొలి రోజు కలెక్షన్ రికార్డ్ మొదట ‘బాహుబలి’ పేరిట వుండేది. బాహుబలి తొలి రోజు కలెక్షన్ ఇరవై మూడు కోట్లు. దిన్ని పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ క్రాస్ చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ తొలి రోజు కలెక్షన్ ఇరవై నాలుగు కోట్లుగా లెక్కగట్టారు. అయితే ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే తొలి రోజు కలెక్షన్ రికార్డ్ మెగాస్టార్ ఖాతాలోకి వెళుతుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఖైదీ నెంబర్ 150 తొలి రోజు కలెక్షన్ రూ 25 నుండి 28కోట్ల వరకూ వచ్చేఅవకాశం వుందని అంచనా . సినిమా ఎలా వున్నప్పటికీ తొలి రోజు కలెక్షన్ రికార్డులను మెగాస్టార్ బద్దలు కొడతారని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు అభిమానులు.