తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని డిసైడయిన షర్మిల… జిల్లాల పర్యటనపై దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు.రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుచరులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.అందులో ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో సమ్మెళనం నిర్వహించాలని నిర్ణయించారు. లోటస్ పాండ్ నుంచి 21న ఉదయం భారి కాన్వాయ్ తో ఖమ్మం వెళ్లి.. గిరిజనుల పోడు భూము పోరాటం చేయనున్నారు. పోడు భూముల్లో పట్టాల ఎజెండా గా సమ్మెళనం జరగనుంది. సమ్మెళనానికి గిరిజనులను సైతం పిలవాలని దిశా-నిర్థేశం చేశారు.
గిరిజనుల్లో అత్యధికులు కన్వర్ట్ అయిపోయారు. ప్రస్తుతం వారు పెరుగుతున్న పరిస్థితుల కారణంగా స్కూల్ స్థాయి కూడా దాటని విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించి… క్రైస్తవ మిషనరీలు ఎప్పుడో పని ప్రారంభించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని గిరిజన ప్రాంతాలలో విపరీతమైన ఓటింగ్ ఉంటుంది. దానికి కారణం ఈ మత మార్పిళ్లేనని రాజకీయంగా అందరూ ఒప్పుకునే అంశం. ఖమ్మం లోక్ సభా నియోజవకర్గంలో కూడా ఈ గిరిజనులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే.. మొదటగా… షర్మిల గిరిజన ఓటు బ్యాంక్ పై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో షర్మిల పార్టీ విషయంలో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. కడప జిల్లాతో వియ్యమందుకున్న ఆ వ్యక్తి.. ఒకప్పుడు… వైసీపీతోనే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్య పోడుభూములు. పోడు భూముల్లో పట్టాల కోసం గిరిజనులు కొట్లాడుతున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోడు భూముల్లో గిరిజనులను హక్కుదారులుగా కల్పిస్తూ పట్టాలు ఇచ్చారు. అయితే అవి కూడా వివాదంలో ఉన్నాయి. అయినప్పటికీ.. రాజన్న రాజ్యంలో ఇచ్చిన విదంగానే పోడు భూముల్లో పట్టాలు దక్కాలంటే మళ్లీ ఆదే రాజ్యం రావాలని గిరిజనులతో చెప్పించనున్నారు. షర్మిల ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్లుగా అన్ని పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.