క్రాక్‌తో సూపర్ హిట్టు కొట్టాడు రవితేజ. అంత వరకు వచ్చిన ఫ్లాపులన్నీ… `క్రాక్`తో మర్చిపోయేలా చేశాడు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. మరోసారి… ఖిలాడీతో.. అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా `ఖిలాడీ` లో రవితేజ లుక్‌ని రివీల్ చేస్తూ ఓ టీజర్ విడుదల చేశారు. చేతిలో ఆయుధం, రయ్ రయ్ మంటూ వస్తున్న జీపులూ.. ఇవన్నీ చూస్తుంటే… ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు అనిపిస్తోంది. రవితేజ మాస్ లుక్, దేవిశ్రీ ఇచ్చిన… కిర్రాక్ బీజియమ్, విజువల్స్.. `ఖిలాడీ`పై అంచనాలు పెంచేలా ఉన్నాయి. రవితేజకు మరో పర్ఫెక్ట్ టేలర్ మేడ్ పాత్రలా కనిపిస్తోంది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.