కియా యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. అనంతపురం నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని…కియా పీఆర్వో… ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో మీడియా ముందు ప్రకటించారు. ఆ తర్వాత ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అనంతపురం ప్లాంట్ను తమిళనాడుకు తరలిచేందుకు అక్కడి ప్రభుత్వంతో..కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతోందంటూ… రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించడంతో.. దేశవ్యాప్తంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. పలు రాష్ట్రాలు కియా పరిశ్రమను తమ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యాయి.
దీనిపై కియా యాజమాన్యం… మాత్రం అధికారికంగా స్పందించలేదు. చివరికి పీఆర్వో… తమ సంస్థ తరలింపు ఆలోచన చేయడం లేదన్న ప్రకటన చేయడంతో.. ఊహాగానాలకు తెరపడినట్లయింది. కియా లెటర్ హెడ్ పై… మీడియాకు విడుదల చేసిన లేఖలోనూ.. అదే చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం.. తమకు… మంచి సహాయసహకారాలు అందిస్తోందని… కియా చెప్పుకొచ్చింది. అయితే.. గతంలోనూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కియా నుంచి ఇటువంటి లేఖను తీసుకుని వచ్చారు.
పదేళ్ల కిందటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పడం వల్లే తాము ఏపీకి వచ్చామంటూ..ఓ లేఖను.. బుగ్గన కియా యాజమాన్యం వద్ద నుంచి తీసుకొచ్చారు. అందులో హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ అంటూ.. కియా యాజమాన్యం సంబోధించడం… వైరల్ అయింది. ఇప్పుడు… కూడా అదే మాదిరిగా ఉన్న లేఖ మీడియాకు విడుదలయింది. కియా ప్లాంట్ విషయంలో.. ఏం జరగబోతోందనేది… కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.