భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది కైరా అద్వానీ. తొలి సినిమా హిట్‌తో మంచి అవకాశాలే దక్కాయి. వినయ విధేయ రామ లో చరణ్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. అయితే ఈలోగా.. ‘లస్ట్ స్టోరీస్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది కైరా. అందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి… షాక్ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లో వైబ్రేటర్ సీన్లో నటించిన కైరా బోల్డ్‌నెస్‌ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. కథానాయికగా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి సన్నివేశాల్లో ఎలా నటించగలిగింది? అని ముక్కున వేలేసుకున్నారు.
వీటిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది కైరా. ”అదంతా కేవలం ఫన్‌లో భాగంగా తెరకెక్కించిన సన్నివేశాలే. అదేదో బూతులా భావించాల్సిన పనిలేదు. సెక్స్. కోరికల్ని కూడా చాలా అందంగా చూపించారు. లస్ట్ స్టోరీస్‌లో కేవలం సెక్స్ మాత్రమే లేదు. అంతకు మించిన చాలా విషయాలే ఉన్నాయి” అంటోంది. ఇక మీదట కూడా అలాంటి వెబ్ సిరీస్‌లలో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదట. తన బోల్డ్ నెస్ అంతా వెబ్ సిరీస్లకేనా, సినిమాల్లో ఏం లేదా అంటే మాత్రం చిన్నగా నవ్వేసి.. సమాధానం దాటేసింది కైరా.