టాలీవుడ్ లో కథానాయికల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాలకైతే మరీనూ. వాళ్లకు సరితూగే కథానాయికల్ని వెదికి పట్టుకోవడం గగనం అయిపోతుంటుంది. అందుకే హీరో – దర్శకుడి కాంబో ఫిక్సవ్వగానే, హీరోయిన్ల వేట మొదలెడతారు. అలా.. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబో సెట్ అవ్వగానే… కథానాయికగా కియారా అద్వాణీ పేరు ఖాయం చేసుకున్నారు.కానీ.. కియారా ఈ ప్రాజెక్టుకి నో చెప్పింది. దానికి కారణం.. రామ్ చరణ్- శంకర్సినిమానే.
చరణ్ – శంకర్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఇందులో హీరోయిన్ గా కియారా ఎంట్రీ ఖాయమైంది. ఈ విషయాన్ని కియారానే స్వయంగా ప్రకటించింది కూడా. కియారా ఇప్పుడు ఫుల్ బిజీ. అటు ఎన్టీఆర్, ఇటు చరణ్.. రెండింటిలో ఒక్క సినిమానే ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఈ దశలో… చరణ్కే ఓటేసింది కియారా. దానికి కారణం.. శంకర్. తనతో సినిమా చేయాలని హీరోలు ఎలా కలలు కంటారో, హీరోయిన్లూ అలానే ఆశిస్తారు. అందుకే శంకర్ సినిమాకి ఓకే చెప్పింది. నిజానికి రామ్ చరణ్ తో ఇది వరకు ఓ సినిమా చేసేసింది కియారా. అలాంటప్పుడు ఎన్టీఆర్ తో జోడీ కట్టాలనుకోవడం సహజం. అప్పుడు కూడా చరణ్ సినిమానే ఎంచుకుంది కియారా. ఎందుకంటే… చరణ్ – కియారా మంచి దోస్తులు. `వినయ విధేయ రామా` సినిమా నుంచి వాళ్ల ప్రెండ్ షిప్ మొదలైంది. ఉపాసన – కియారా కూడా బాగా క్లోజ్ గా ఉంటారు. ఈ సమీకరణాలతోనే… చరణ్ సినిమాపై సంతకాలు చేసింది కియారా.