మహేష్ బాబు ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం అయిన హిందీ హీరోయిన్ కీయరా అడ్వాణీ. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే… సోమవారం కీయరాకు షూటింగ్ లేదు. దాంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతా చక్కర్లు కొట్టారు. చార్మినార్, సాలర్ జంగ్ మ్యూజియం, నాంపల్లిలోని ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్ అన్నీ తిరిగారు. గాజులు షాపింగ్ చేశారు. ఐస్ క్రీమ్ తిన్నారు. రోజంతా సరదా సరదాగా గడిపారు. హీరోయిన్ అంత ఫ్రీగా రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరూ గుర్తు పట్టలేదా ఏంటి అనుకుంటున్నారా? జనాలు గుర్తు పడతారని తల చుట్టూ చున్నీ కప్పుకుని, పెద్ద అద్దాల కళ్లజోడు పెట్టుకుని తిరిగారు.